Rashmika Mandanna: రష్మిక మనసు దోచిన ఆ నాలుగు ఫోటోలు.. వాటిని చూస్తూనే ఉండాలనిపిస్తుందంటూ..

తాజాగా తనకు తెలియకుండానే తీసిన ఓ ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేస్తూ తెగ మురిసిపోయింది. తనకు చాలా వింతగా అనిపిస్తుందని.. అయినా కానీ ప్రేమగా కూడా ఉందంటూ చెప్పుకొచ్చింది.

Rashmika Mandanna:  రష్మిక మనసు దోచిన ఆ నాలుగు ఫోటోలు.. వాటిని చూస్తూనే ఉండాలనిపిస్తుందంటూ..
Rashmika
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 25, 2022 | 12:53 PM

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ రష్మిక (Rashmika Mandanna ). ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. పుష్ప చిత్రంలో శ్రీవల్లి పాత్రలో జీవించేసింది రష్మిక. దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ అంతా నేషనల్ క్రష్ అంటూ ముద్దుగా పిలిచుకునే ఈ చిన్నది ఇప్పుడు క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇప్పుడు ఆమె చేతిలో వరిసు, పుష్ప 2, యానిమల్, మిస్టర్ మజ్ను, గుడ్ బై చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలన్ని శరవేగంగా షూటింగా జరపుకుంటున్నాయి. ఓ వైపు చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు.. సోషల్ మిడీయాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్.. పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంది. తాజాగా తనకు తెలియకుండానే తీసిన ఓ ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేస్తూ తెగ మురిసిపోయింది. తనకు చాలా వింతగా అనిపిస్తుందని.. అయినా కానీ ప్రేమగా కూడా ఉందంటూ చెప్పుకొచ్చింది.

” ఈ ఫోటో ఎప్పుడు తీశారో నాకు నిజంగానే గుర్తులేదు. కానీ ఒక నటిగా కాకుండా నన్ను నేనుగా అభివర్ణించే నాలుగు చిత్రాలు ఇవి. ఫోటోస్ వేల మాటలు చెప్పగల్గుతాయని కొందరు అంటున్నారు. ఈ పిక్ ఎప్పుడు తీశారో కూడా నాకు గుర్తులేదు. కానీ వీటిని తీసినప్పుడు కలిగిన అనుభూతి మాత్రం నాకు ఇంకా గుర్తుంది. నా చిన్న ప్రపంచంలో నేను. నాకు ఎప్పటికీ ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఫోటోస్ చూస్తుంటే చాలా వింతగా ఉంది.. కానీ నేను వీటిని ప్రేమిస్తున్నాను ” అంటూ రాసుకొచ్చింది. దీంతో రష్మిక పోస్ట్ చేసిన ఫోటోలకు ఫ్యాన్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. మెస్మరైజింగ్.. మీరు మరింత అందంగా ఉన్నారు. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.