Megastar Chiranjeevi: మెగాహీరోస్ చిన్నప్పుడు ఎలా ఉన్నారో చూశారా ?.. వైరలవుతున్న ఓల్డ్ వీడియో..

తాజాగా సోషల్ మీడియాలో చిరు షేర్ చేసిన అలనాటి వీడియో చక్కర్లు కొడుతుంది. అందులో రామ్ చరణ్, అల్లు అర్జున్ చిన్నప్పుడు చిరంజీవి సమక్షంలో డ్యాన్స్ చేస్తున్నారు. వారి డ్యాన్స్ చూసి చిరు సైతం తెగ మురిసిపోతున్నారు.

Megastar Chiranjeevi: మెగాహీరోస్ చిన్నప్పుడు ఎలా ఉన్నారో చూశారా ?.. వైరలవుతున్న ఓల్డ్ వీడియో..
Megastar Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 25, 2022 | 10:43 AM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రీఎంట్రీ తర్వాత చిరు స్పీడ్ పెంచారు. ఆయన నటిస్తోన్న గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్నాయి. మరోవైపు తనవరకు వచ్చిన ప్రతి ఇంట్రెస్టింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు మెగాస్టార్. ఇటీవలే చిరు తన పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో చిరు షేర్ చేసిన అలనాటి వీడియో చక్కర్లు కొడుతుంది. అందులో రామ్ చరణ్, అల్లు అర్జున్ చిన్నప్పుడు చిరంజీవి సమక్షంలో డ్యాన్స్ చేస్తున్నారు. వారి డ్యాన్స్ చూసి చిరు సైతం తెగ మురిసిపోతున్నారు.

1990లో మెగా హీరోస్ అంతా కలిసి ఒక చోట చేరి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు. అప్పుడే వారి వద్దకు వచ్చిన చిరు డ్యాన్స్ చేయాలని ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేకాదు.. అందులో చరణ్ వేస్తున్న స్టెప్పులను వెనక నుంచి అనుకరిస్తున్నారు చిరు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. చిరు నటిస్తోన్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిది పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. మరోవైపు ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో హిట్ అందుకున్న చెర్రీ.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి.