Special Party: కూతురు బర్త్‌డేకి చిరు వ్యాపారి స్పెషల్ పార్టీ.. ఎగబడ్డా అమ్మాయిలు.. ఏంటో తెలుసా..
ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి రూపంగా భావించిన ఓ తండ్రి.. తన గారాల పట్టి మొదటి పుట్టిన రోజు వేడుకను ప్రత్యేకంగా నిర్వహించాలనుకున్నాడు. అందుకు వినూత్నంగా ఆలోచించిన అతను కుమార్తె పుట్టిన వేడుకల్లో
ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి రూపంగా భావించిన ఓ తండ్రి.. తన గారాల పట్టి మొదటి పుట్టిన రోజు వేడుకను ప్రత్యేకంగా నిర్వహించాలనుకున్నాడు. అందుకు వినూత్నంగా ఆలోచించిన అతను కుమార్తె పుట్టిన వేడుకల్లో పానీపూరీని ఉచితంగా పంపిణీ చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి జరుపుకునే పద్ధతులను బ్రేక్ చేస్తూ.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పానీపూరీ వ్యాపారి తన కుమార్తె మొదటి పుట్టిన రోజు వేడుకలను భిన్నంగా జరిపాడు. తనకు ఎంతో ప్రత్యేకమైన రోజున అందరికి గుర్తుండిపోయేలా రుచికరమైన గోల్‌గప్పాలను అందించి వార్తల్లో నిలిచాడు. భోపాల్ లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి అంచల్ గుప్తాకు గత ఏడాది ఆగస్టు 17న కుమార్తె పుట్టింది. ఈ ఏడాది మొదటి పుట్టిన రోజుని జరుపుకుంది ఆ చిన్నారి. తనకు ఆడబిడ్డలంటే ఇష్టమని, తనకు వివాహం అయినప్పటినుంచి తనకు ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నానని, తన ఆశ నెరవేరిందని, అందుకే ఇలా అందరికీ పానీపూరి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపాడు. దీని కోసం 31 స్టాల్స్ ను ఏర్పాటు చేసి.. వందలమందికి ఉచితంగా పానీపూరీని పంపిణీ చేశాడు. మొత్తానికి కుమార్తె మొదటి పుట్టిన రోజున సుమారు 1,10,000 పానీపూరీలు ఉచితంగా పంపిణీ చేశాడు. ఇలా చేయడానికి కారణం ఆడపిల్లలను చదివించాల్సిన ఆవశ్యకత గురించి అందరికి తెలపడమే లక్ష్యమని పేర్కొన్నాడు. గుప్తా చేసిన పని గురించి తెలుసుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..