Jr.NTR : కటౌట్ అదిరింది భయ్యా.. డ్రాగన్ లుక్లో ఎన్టీఆర్.. న్యూస్టైల్ చూసి ఫ్యాన్స్ ఫిదా..
దేవర తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నారు పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పిక్స్ చేసినట్లు ప్రచారం నడుస్తుంది. మరోవైపు ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలలుగా జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ న్యూలుక్స్ అందరిని కట్టిపడేస్తున్నాయి.

పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది. ఆర్ఆర్ఆర్, దేవర తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ రా యాక్షన్ తో రాబోయే సినిమా పై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Krishnavamshi : నేను తీసిన సినిమాల్లో ఆ రెండే చెత్త సినిమాలు.. డైరెక్టర్ కృష్ణవంశీ..
ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించి ఓ లేటేస్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించిన తారక్ లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. స్లిమ్ ఫిట్ బాడీ, లాంగ్ బియర్డ్, చెవికి రింగ్, బ్లూ జీన్స్ విత్ హుడ్డీతో మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం తారక్ న్యూలుక్ చూసి డ్రాగన్ ఫైనల్ లుక్ ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ న్యూలుక్ ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Actress : మల్లీశ్వరీ సినిమా నేను చేయకుండా ఉండాల్సింది.. నటి కామెంట్స్..
ఓవైపు డ్రాగన్ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. ఈ సినిమా గురించి నిత్యం ఏదోక విషయం నెట్టింట వైరలవుతుంది. తాజాగా ఎన్టీఆర్ న్యూ వీడియో చూస్తుంటే డ్రాగన్ తాజా షెడ్యూల్ ను విదేశాల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ లొకేషన్ హైదరాబాద్ నుంచి జోర్డాన్ కు షిఫ్ట్ చేశారని సమాచారం.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అందంలో రాజహంస.. 47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్.. ఆత్మస్థైర్యానికి నిలువెత్తు రూపం..
Man Of Masses @tarak9999 Anna off to Jordon for #Dragon shoot🐉❤️🔥
On screen look🔥🔥🔥🔥🔥#NTRNeel https://t.co/FXvlTeLBxB pic.twitter.com/ogTqL38ZXx
— Dragon🐉🦚 (@Blood_bath79) February 8, 2026
ఎక్కువ మంది చదివినవి : Love Song : నిజంగా ఏం పాట బాసూ.. 1999 నుంచి ట్రెండింగ్.. ప్రేమికులకు చాలా స్పెషల్ సాంగ్..
