John Abraham: అమితాబ్‌ షోలో కన్నీళ్లు పెట్టుకున్న యాక్షన్‌ హీరో.. ఎందుకంటే..

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న గేమ్‌ షో.. 'కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ)'. సామాన్యులను సైతం లక్షాధికారులు, కోటీశ్వరులుగా మార్చే ఈ టీవీ షోకు హిందీ జనాల్లో భారీగా క్రేజ్‌ ఉంది. కేవలం క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్స్‌ కాకుండా..

John Abraham: అమితాబ్‌ షోలో కన్నీళ్లు పెట్టుకున్న యాక్షన్‌ హీరో.. ఎందుకంటే..
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2021 | 3:34 PM

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న గేమ్‌ షో.. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ)’. సామాన్యులను సైతం లక్షాధికారులు, కోటీశ్వరులుగా మార్చే ఈ టీవీ షోకు హిందీ జనాల్లో భారీగా క్రేజ్‌ ఉంది. కేవలం క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్స్‌ కాకుండా కంటెస్టెంట్ల జీవితాల్లోని ఆసక్తికర విశేషాలను అందరికీ పరిచయం చేస్తూ ఈ షోనూ ముందుకు నడిపిస్తున్నారు అమితాబ్‌. వినోదానికి కూడా ఎంతో ప్రాధాన్యముంటుంది. సామాన్యులతో పాటు అప్పుడప్పుడు పలువురు ప్రముఖులు ఈ గేమ్‌ షోకు వస్తుంటారు. తాజాగా ఈ కార్యక్రమానికి యాక్షన్‌ హీరో జాన్‌ అబ్రహం హాజరయ్యాడు. తన తాజా చిత్రం ‘సత్యమేవ జయతే2’ ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్‌ దివ్యా ఖోస్లా కుమార్‌తో కలిసి షోలో పాల్గొన్నాడు.

అభిషేక్‌ను చూసి మీరు మాట మార్చారు.. తాజాగా దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. బాలీవుడ్‌లో యాక్షన్‌ హీరోగా పేరున్న జాన్‌ ఈషోలో కూడా తన ప్రతిభా నైపుణ్యాలను పంచుకున్నాడు. ఇందులో భాగంగా తన సినిమాల్లోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను అనుకరించి చూపించాడు. వేలిపై ఫుట్‌బాల్‌ను గిరాగిరా తిప్పి ఆకట్టుకున్నాడు. కాగా ఇదే ప్రయత్నం బిగ్‌ బీ చేయగా ఫెయిల్‌ అయ్యాడు. అనంతరంజాన్‌ తనషర్ట్ లేపి తన సిక్స్ ప్యాక్ చూపించగా.. ప్రేక్షకులందరూ గట్టిగా అరిచారు. దీంతో అమితాబ్‌ ‘కేవలం ఆడవాళ్లు మాత్రమే అరుస్తున్నారు’ చూడు అంటూ జాన్‌ని ఆటపట్టించారు. ఈ సందర్భంగా అమితాబ్‌తో ‘ధూమ్‌’ సినిమా నాటి సంగతులు గుర్తు చేసుకున్నాడీ హ్యాండ్సమ్‌ హీరో. ‘ధూమ్’ సినిమా రిలీజైన తర్వాత నేను బైక్‌పై వచ్చి మిమ్మల్ని కలిశాను. అప్పుడు మీరు బైక్స్‌ విషయంలో అభిషేక్‌ను ప్రోత్సహించవద్దు ప్లీజ్‌ అని నాతో చెప్పారు. అయితే అదే సమయంలో అభిషేక్‌ రావడం చూసి’బైక్ బావుంది అన్నారు’ అని మాట మార్చారని చెప్పాడు. అయితే ప్రోమో ఎండింగ్‌లో ఏదో బాధ కలిగించే విషయం గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు జాన్‌. అతడిని చూసి బిగ్ బీతో పాటు గ్యాలరీలోని ప్రేక్షకులంతా బాధపడ్డారు. అయితే ఈ యాక్షన్‌ హీరో దేనిగురించి బాధపడ్డాడో మాత్రం చెప్పలేదు. పూర్తి వివరాలు తెలియాలంటే నవంబర 26న ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. అప్పటివరకు ఈ ఆసక్తికర ప్రోమోను చూసి ఆనందించండి.

Also Read:

Pushpa: ప్రీరిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్న పుష్ప టీమ్.. ఈవెంట్ జరిగేది ఆ రోజేనా..?

Priyanka Chopra: ప్రియాంక చోప్రా.. భర్త ఇంటి పేరును తొలగించింది అందుకేనా.? ఈ వార్తలో నిజం ఎంత..

Swara Bhasker: సుస్మిత, రవీనా అడుగుజాడల్లో స్వరా భాస్కర్‌.. పెళ్లి కాకుండానే అనాథ బిడ్డను దత్తత తీసుకోనున్న నటి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో