Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swara Bhasker: సుస్మిత, రవీనా అడుగుజాడల్లో స్వరా భాస్కర్‌.. పెళ్లి కాకుండానే అనాథ బిడ్డను దత్తత తీసుకోనున్న నటి..

సుస్మితా సేన్‌, రవీనాటాండన్‌, సన్నీలియోనీ, ఆమని తదితర సెలబ్రిటీలు అనాథ బిడ్డలను దత్తత తీసుకుని తమ మంచి మనసును చాటుకున్నారు. ఇందులో సుస్మిత, రవీనా అయితే పెళ్లి కాకుండానే ఈ మంచి పనికి పూనుకున్నారు..

Swara Bhasker: సుస్మిత, రవీనా అడుగుజాడల్లో స్వరా భాస్కర్‌.. పెళ్లి కాకుండానే అనాథ బిడ్డను దత్తత తీసుకోనున్న నటి..
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2021 | 2:58 PM

సుస్మితా సేన్‌, రవీనాటాండన్‌, సన్నీలియోనీ, ఆమని తదితర సెలబ్రిటీలు అనాథ బిడ్డలను దత్తత తీసుకుని తమ మంచి మనసును చాటుకున్నారు. ఇందులో సుస్మిత, రవీనా అయితే పెళ్లి కాకుండానే ఈ మంచి పనికి పూనుకున్నారు. ఇప్పుడు మరో ప్రముఖ బాలీవుడ్‌ నటి స్వరాభాస్కర్‌ వీరి అడుగుజాడల్లో నడవనుంది. ఆమె కూడా ఓ అనాథ బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. అది కూడా పెళ్లికాకుండానే. ఇందుకోసం ‘సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (CARA)లో తన పేరు నమోదు చేసుకుంది. ‘నాకు కూడా ఒక కుటుంబం, పిల్లలు ఉండాలనుకుంటున్నాను. అందుకు దత్తతే సరైన మార్గమని గ్రహించాను. అదృష్టవశాత్తూ మన దేశంలో నాలాంటి ఒంటరి మహిళలు పిల్లల్ని దత్తత తీసుకునేందుకు అనుమతి ఉంది. ఇందుకోసం నేను CARA లోని కొంతమంది అధికారులతో కూడా మాట్లాడాను. వారు నాకు చాలా మద్దతునిస్తున్నారు. దత్తతకు సంబంధించి ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్‌ పూర్తి చేశాను’

ఆ క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. ‘ఇక పిల్లల దత్తత విషయం గురించి ఇటీవలే నా తల్లిదండ్రులతో మాట్లాడాను. వారు కూడా నా నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి మరికొంత సమయం పడుతుంది. ఒక్కోసారి 3 ఏళ్లు కూడా పడుతుందని CARA అధికారులు చెబుతున్నారు. అయితే నేను అప్పటివరకు వెయిట్ చేయలేను. ఎప్పటికప్పుడు బిడ్డను చేతుల్లోకి తీసుకుందామా అని ఎదురుచూస్తున్నాను’ అని స్వరా భాస్కర్‌ చెప్పుకొచ్చింది. ఇక ఆమె సినిమా కెరీర్‌ విషయానికొస్తే.. ‘తను వెడ్స్‌ మను’ సిరీస్‌, ‘రాన్‌జానా’, ‘వీరే ది వెడ్డింగ్‌’, ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో’ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ‘షీర్‌ ఖుర్మా’ అనే సినిమాతో పాటు టీవీ షోల్లో నటిస్తోంది.

kaikala satyanarayana : కైకాల ఆరోగ్యం పై సీఎం జగన్ ఆరా.. ఏ సహాయానికైనా సిద్ధం అంటూ దైర్యం..

Kangana Ranaut: తమ ముందు హాజరు కావాలని నటి కంగనా రనౌత్‌కు సమన్లు​జారీ చేసిన ఢిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య కమిటీ.. ఎందుకంటే..

Viral Photo: ఈ పాలబుగ్గల చిన్నారికి అభిమానుల్లో యమా క్రేజ్.. తెలుగునాట సూపర్ హిట్స్ అందుకుంది..