kaikala satyanarayana : కైకాల ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా.. ఏ సహాయానికైనా సిద్ధం అంటూ దైర్యం..

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషమం గా ఉండటంతో ఆయన అభిమానులు, సినీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.

kaikala satyanarayana : కైకాల ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా.. ఏ సహాయానికైనా సిద్ధం అంటూ దైర్యం..
Jagan
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 25, 2021 | 2:49 PM

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆయన అభిమానులు, సినీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆయన వెంటిలెటర్ పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని ఆయన కూతురు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దు అని ఆమె కోరారు. ఇక కైకాల ఆరోగ్యం పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆరాతీసారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఫోన్ లో అడిగి తెలుసుకున్నారు.

సీఎం జగన్ కైకాల సత్యనారాయణ చిన్న కుమారుడు కేజిఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావు(చిన్నబాబు)కు ఫోన్ చేసి కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరుపున ఎలాంటి సాయం కావాలన్న చేస్తానని జగన్ హామీ ఇచ్చనట్టు తెలుస్తుంది. ప్రభుత్వం తరపున ఏమైనా సహాయం కావాలంటే అడగాలని ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ధైర్యం చెప్పారు. ఇక గత నెల 30న కూడా కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.  1959 లో సిపాయి కూతురు సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టారు కైకాల సత్యనారాయణ. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు జీవం పోసి.. నవరస నట సార్వభౌమగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఖ్యాతిగాంచారు. గత 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారు 777 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut: తమ ముందు హాజరు కావాలని నటి కంగనా రనౌత్‌కు సమన్లు​జారీ చేసిన ఢిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య కమిటీ.. ఎందుకంటే..

Chiranjeevi: ఏపీ సర్కార్ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. కొన్ని సూచనలు

Viral Photo: ఈ పాలబుగ్గల చిన్నారికి అభిమానుల్లో యమా క్రేజ్.. తెలుగునాట సూపర్ హిట్స్ అందుకుంది..