Pushpa: ప్రీరిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్న పుష్ప టీమ్.. ఈవెంట్ జరిగేది ఆ రోజేనా..?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాకోసమే బన్నీ ఆర్మీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pushpa: ప్రీరిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్న పుష్ప టీమ్.. ఈవెంట్ జరిగేది ఆ రోజేనా..?
Pushpa
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 25, 2021 | 3:03 PM

Pushpa: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాకోసమే బన్నీ ఆర్మీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక డీ గ్లామర్ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ, ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే పాటలు ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ను దక్కించుకుంటున్నాయి ఈ సాంగ్స్ . ఇక ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. డిసెంబర్ 17వ పుష్ప మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఇప్పుడు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ పై ఆసక్తి పెరిగింది. అయితే ఈ ఈవెంట్ ను హైదరాబాద్ లోనే నిర్వహించనున్నారట. డిసెంబర్ 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరపాలనే ఆలోచనలో మేకర్స్  ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా.. అనసూయ, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut: తమ ముందు హాజరు కావాలని నటి కంగనా రనౌత్‌కు సమన్లు​జారీ చేసిన ఢిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య కమిటీ.. ఎందుకంటే..

Chiranjeevi: ఏపీ సర్కార్ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. కొన్ని సూచనలు

Viral Photo: ఈ పాలబుగ్గల చిన్నారికి అభిమానుల్లో యమా క్రేజ్.. తెలుగునాట సూపర్ హిట్స్ అందుకుంది..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!