Tollywood: బిజినెస్‌లో టాలీవుడ్ హీరోలకు మార్గదర్శి ఆయనే.. రియల్ ఎస్టేట్‌తో కోట్లు కొల్లగొట్టిన హీరో
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు స్క్రీన్ మీదే కాదు, బిజినెస్ రంగాల్లో కూడా రాణిస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టి, భారీ ఆస్తులు సంపాదించిన స్టార్లు ఎంతోమంది ఉన్నారు. కానీ, ఆల్ టైమ్ రికార్డ్‌లో ముందుండి, తన సినిమా ఆదాయాన్ని స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేసి..

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు స్క్రీన్ మీదే కాదు, బిజినెస్ రంగాల్లో కూడా రాణిస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టి, భారీ ఆస్తులు సంపాదించిన స్టార్లు ఎంతోమంది ఉన్నారు. కానీ, ఆల్ టైమ్ రికార్డ్‌లో ముందుండి, తన సినిమా ఆదాయాన్ని స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేసి, వేల కోట్ల రూపాయల ఆస్తులు పోగేసిన హీరో ఎవరో తెలుసా? ఆయన ఒక లెజెండరీ ఫిగర్! ఆయన పెట్టుబడులు పెట్టడమే కాదు, ‘భూమి మీద పెట్టుబడి పెట్టండి. అది మీ భవిష్యత్తుని రక్షిస్తుంది’ అని ఎందరో నటీనటులకు సలహా ఇచ్చి వారికి మార్గదర్శకంగా మారారు.
ఆయన నటుడిగా రాణిస్తున్న కాలంలోనే ఫైనాన్షియల్ డిసిప్లిన్‌కు పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో హిట్ ఇచ్చి, రిమ్యునరేషన్ సంపాదించినా, ఆ సంపదను విలాసాలకు కాకుండా, భవిష్యత్తు భద్రతకు ఉపయోగించారు. ఆయన చుట్టూ ఉన్న సహనటులు, ఫ్రెండ్స్ పలువురు డబ్బును ఫిల్మ్ ప్రొడక్షన్‌లు, పార్ట్‌నర్‌షిప్ బిజినెస్‌లలో కోల్పోయారు. కానీ, ఆయన భిన్నంగా ఆలోచించారు. ‘పార్ట్‌నర్‌షిప్‌లలో పెట్టకు, ఫిల్మ్‌లలో కొంచెం మాత్రమే ఇన్వెస్ట్ చేయి. మిగతా పెట్టుబడులు భూముల్లో పెట్టు’ అని తన స్నేహితులు, సన్నిహితులకు సలహా ఇచ్చేవారు. ఎందుకంటే, భూమి మాత్రమే శాశ్వత ఆస్తి – భూమి 1/4వ వంతు మాత్రమే, దానిలో కూడా 15-20% మాత్రమే నివసించేలా ఉంది. ఈ సలహా తనకు మాత్రమే కాకుండా, ఎంతోమంది నటీనటులకు తిరుగులేని నిర్ణయంగా మారింది.
సక్సెస్ సీక్రెట్..
ఇంతకీ ఆ హీరో ఎవరంటే… శోభన్ బాబు! ‘నట భూషణ్’, ‘సోగ్గాడు’గా పేరుగాంచిన ఈ లెజెండరీ హీరో, తన ఫైనాన్షియల్ విజెడ్‌తో తెలుగు సినిమా చరిత్రలో అసమానమైన చోటు సంపాదించారు. 1937లో కృష్ణా జిల్లలో జన్మించిన ఉప్పు శోభన్ చలపతి రావు, 1959లో ‘భక్త సబరి’, ‘దైవ బలం’ సినిమాలతో సినీరంగంలో అడుగుపెట్టారు. కెరీర్ తొలినాళ్లో ఎన్నో కష్టాలు పడిన శోభన్‌బాబు ‘సీతారామ కల్యాణం’, ‘మహామంత్రి తిమ్మరుసు’, ‘లవకుశ’, ‘నర్తనశాల’ వంటి నేషనల్ అవార్డు విజేత చిత్రాల్లో నటించి, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించారు. 200కి పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి తిరుగులేని హీరోగా రాణించారు. కానీ, ఆయన నిజమైన సక్సెస్ సీక్రెట్ స్క్రీన్ వెనుక ఉంది – అది రియల్ ఎస్టేట్!

Sobhan Babu
శోభన్ బాబు తన సినిమా ఆదాయాన్ని పూర్తిగా చెన్నై చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో (వెల్లాచెర్రీ వంటివి) ప్లాట్లు, భూముల్లో పెట్టారు. ఒకే చోట పెద్ద మొత్తంలో పెట్టకుండా, రిస్క్ తగ్గించడానికి వివిధ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేశారు. మార్కెట్ ట్రెండ్స్, ప్రభుత్వ ప్రాజెక్టులు, రోడ్లు విస్తరణలు – ఇవన్నీ అధ్యయనం చేసి, ఎక్స్‌పర్ట్ సలహాలతో ముందుగా డెవలప్ అయ్యే ప్రాంతాలు ఎంచుకున్నారు. ఫలితంగా, చిన్న పెట్టుబడులు కూడా భారీ రిటర్న్స్ ఇచ్చాయి.
ఆయన మరణ సమయం (2008)లో ఆయన ఆస్తుల విలువ సుమారు రూ.80,000 కోట్ల వరకు ఉందని అంచనా. ఇప్పుడు, మార్కెట్ గ్రోత్‌తో అది లక్షల కోట్లకు చేరింది. ఆయన కుమార్తెలు చెన్నై, తమిళనాడులో రియల్ ఎస్టేట్ డెవలపర్లుగా రాణిస్తున్నారు. మురళీ మోహన్, చంద్ర మోహన్ వంటి నటులు కూడా శోభన్ బాబు సలహాతో భూములపై పెట్టుబడులు పెట్టి భారీ లాభాలతో రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని శక్తులుగా ఎదిగారు.




