Tollywood: పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ రూమర్స్ ఎదుర్కొంది.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?
టాప్ హీరోహీరోయిన్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల వరకు ప్రతిఒక్కరూ ఏదో ఒక విషయంలో ట్రోల్స్ బారిన పడినవారే. స్టార్‌కిడ్స్ అయినా, స్వయంకృషితో ఎదిగినవాళ్లైనా ట్రోల్స్ దగ్గరకి వచ్చేసరికి అందరూ ఒక్కటే. నిజం చెప్పాలంటే స్టార్‌కిడ్స్‌కి ట్రోల్స్ గోల కొంచెం ఎక్కువే. తానూ బాడీషేమింగ్ ట్రోల్స్..

సినీ ఇండస్ట్రీలో రూమర్స్, గాసిప్స్ సర్వసాధారణం. ముఖ్యంగా హీరోహీరోయిన్ల రిలేషన్షిప్స్ మీద రకరకాల మీమ్స్, ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. అంతేకాదు బాడీషేమింగ్ ట్రోల్స్ కూడా తక్కువేం కాదు. సోషల్ మీడియా వచ్చాక ఈ ట్రోల్స్ గోల మరీ ఎక్కువైంది. కాస్త చిక్కితే డైట్లో ఉన్నారని, కాస్త బొద్దుగా అయితే ఏదో హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందని.. ఇలా రకరకాల గాసిప్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేస్తూనే ఉంటారు.
టాప్ హీరోహీరోయిన్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల వరకు ప్రతిఒక్కరూ ఏదో ఒక విషయంలో ట్రోల్స్ బారిన పడినవారే. స్టార్‌కిడ్స్ అయినా, స్వయంకృషితో ఎదిగినవాళ్లైనా ట్రోల్స్ దగ్గరకి వచ్చేసరికి అందరూ ఒక్కటే. నిజం చెప్పాలంటే స్టార్‌కిడ్స్‌కి ట్రోల్స్ గోల కొంచెం ఎక్కువే. తానూ బాడీషేమింగ్ ట్రోల్స్ ఎన్నో ఎదుర్కొన్నానంటోంది బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా.
95 కిలోల నుంచి 65 కిలోలకి..
బాలీవుడ్ అంటేనే జీరో సైజ్ హీరోయిన్లు, కండలు తిరిగిన హీరోలు. కానీ పలు ఆరోగ్య సమస్యలు, వారసత్వ లక్షణాల వల్ల కొందరు హీరోయిన్లు అధిక బరువు సమస్య బారినపడి ట్రోల్స్‌కి గురయ్యారు. కాజోల్, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, సోహా అలీఖాన్.. ఇలా చెప్పుకుంటూపోతే లిస్ట్ పెద్దగానే ఉంది. ‘జటాధర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్న సోనాక్షి తన బాడీషేమింగ్ ట్రోల్స్ గురించి పంచుకుంది.
తాను చిన్నప్పటినుంచే బొద్దుగా ఉండేదాన్నని, ఎలాగైనా బరువు తగ్గాలని కాలేజీ రోజుల్లోనే నిర్ణయించుకుని రెండున్నర సంవత్సరాలు చాలా కష్టపడి 95 కిలోల నుంచి 65 కిలోలకు.. అంటే ఏకంగా 30 కిలోల బరువు తగ్గానంటోంది సోనాక్షి. కేవలం ఆరోగ్యంగా ఉండటం కోసమే తాను కష్టపడి బరువు తగ్గానని, హీరోయిన్ కావాలనే లక్ష్యంతో బరువు తగ్గలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు, 18 సంవత్సరాల వయస్సులో అధికబరువుతో కనీసం 30 సెకన్లు కూడా థ్రెడ్‌మిల్‌పై పరిగెత్తలేకపోయానని, అలాంటి పరిస్థితిని మార్చుకోవాలనే లక్ష్యంతోనే కష్టపడి బరువు తగ్గానంటోంది సోనాక్షి.
బరువు తగ్గడం కోసం సోనాక్షి చాలా కష్టపడింది. యోగా, జిమ్, కార్డియో వ్యాయామాలతో పాటు ప్రణాళికబద్ధమైన ఆహారంతో అనుకున్నది సాధించింది. నటిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సోనాక్షి తన కెరీర్లో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంది.
బాడీ షేమింగ్ మాత్రమే కాదు, సోనాక్షి ప్రెగ్నెంట్ అని కూడా సోషల్ మీడియా కోడై కూసింది. దాదాపు తనను 16 నెలలపాటు గర్భిణి అని ట్రోల్ చేశారు. కానీ బరువు తగ్గిన సోనాక్షిని చూశాక అవన్నీ వదంతులని తేలింది. బరువు తగ్గడం అనేది దీర్ఘకాల ప్రక్రియ. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తేనే సాధ్యమవుతుంది. అధిక బరువుతో బాధపడేవారికి సోనాక్షి ఒక రోల్ మోడల్.




