AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌కు బాలీవుడ్‌ ఖాన్.. రాంచరణ్ డైరెక్టర్‌‌తో సినిమాకు బాలీవుడ్ బాద్‌షా గ్రీన్‌సిగ్నల్

బాహుబలి, ఆర్​ఆర్​ఆర్​, పుష్ప పాన్​ఇండియా సినిమాలుగా విడుదలై టాలీవుడ్​ ప్రతిష్టను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లాయి. సౌత్​ సినిమా, బాలీవుడ్​ అనే హద్దులు చెరిగిపోయి ఇండియన్​ సినిమాగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దక్షిణాది నటీనటులు బాలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటూ రాణిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. టాలీవుడ్‌లో అవకాశాలు..

టాలీవుడ్‌కు బాలీవుడ్‌ ఖాన్.. రాంచరణ్ డైరెక్టర్‌‌తో సినిమాకు బాలీవుడ్ బాద్‌షా గ్రీన్‌సిగ్నల్
Shah Rukh Khan
Nikhil
|

Updated on: Nov 17, 2025 | 10:55 PM

Share

బాహుబలి, ఆర్​ఆర్​ఆర్​, పుష్ప పాన్​ఇండియా సినిమాలుగా విడుదలై టాలీవుడ్​ ప్రతిష్టను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లాయి. సౌత్​ సినిమా, బాలీవుడ్​ అనే హద్దులు చెరిగిపోయి ఇండియన్​ సినిమాగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దక్షిణాది నటీనటులు బాలీవుడ్​లో పలు అవకాశాలు అందుకుంటూ విజయవంతంగా రాణిస్తున్నారు. అంతేకాదు, దక్షిణాదిన రూపొందుతున్న పాన్​ ఇండియా సినిమాల్లో బాలీవుడ్ నటీనటులు కీలకపాత్రల్లో మెరుస్తున్నారు.

నిజానికి దక్షిణాది నటీనటులకు బాలీవుడ్​లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. దక్షిణాది సినిమా ఆస్కార్​ స్థాయికి ఎదిగింది. అందువల్ల అందరి చూపు దక్షిణాదిపైనే ఉంది. అట్లీ, సందీప్​ రెడ్డి వంగా వంటి దర్శకులు బాలీవుడ్​లోనూ రాణించి తామేంటో నిరూపించుకున్నారు. తాజాగా బాలీవుడ్​ స్టార్​ హీరో టాలీవుడ్​లో నేరుగా సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది!

బుచ్చిబాబు డైరెక్షన్​లో..

వరుస బ్లాక్‌బస్టర్లతో దేశవ్యాప్తంగా థియేటర్లు కిక్కిరిసిపోయేలా చేసిన బాలీవుడ్ సూపర్‌స్టార్… ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులకు మాస్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు! ఇప్పటివరకు తెలుగులో కేవలం గెస్ట్ రోల్స్, క్యామియోలతోనే కనిపించిన ఈ హీరో… ఇక తొలిసారిగా పూర్తి ఫుల్-లెంగ్త్ తెలుగు సినిమాలో లీడ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇది కేవలం ఒక సినిమా కాదు… తెలుగు సినీ చరిత్రలోనే ఒక హిస్టారికల్ మూమెంట్​గా మారనుంది. ఈ ప్రాజెక్ట్​కి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

యంగ్ & టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా (ఉప్పెన ఫేమ్) రాసిన స్క్రిప్ట్‌ను వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట ఆ స్టార్​ హీరో! బుచ్చిబాబు సనా ఈ పాత్రను ప్రత్యేకంగా ఆ స్టార్ ఏజ్, ఇమేజ్, ఎమోషనల్ డెప్త్‌కు తగ్గట్టు రాశాడట. రెండు గంటలపాటు జరిగిన స్టోరీ డిస్కషన్​కి ఆ స్టార్ హీరో వెంటనే సినిమాకి ఒప్పేసుకున్నారట.

ఇంతకీ ఆ హీరో ఎవరంటే… బాలీవుడ్ కింగ్, పాన్-ఇండియా సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్! కింగ్ ఖాన్ తొలిసారిగా స్ట్రెయిట్ తెలుగు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటివరకు ‘జవాన్’, ‘పఠాన్’ ద్వారా సౌత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న SRK… ఇక నేరుగా తెలుగు స్క్రిప్ట్‌లో, తెలుగు డైరెక్టర్‌తో, తెలుగు ప్రేక్షకుల కోసమే ఒక భారీ చిత్రం చేయబోతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ జనవరి 2026 నుంచి మొదలై, 2027లో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా తెలుగు-హిందీలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుందట. ఇదే నిజమైతే కింగ్​ఖాన్​ తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి మరి!

ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. మొత్తం అదే చేసేస్తుంది!
ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. మొత్తం అదే చేసేస్తుంది!
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!