AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ameesha Patel: అందుకే పెళ్లి చేసుకోలేదు.. షాకింగ్ కారణం చెప్పిన బాలీవుడ్ బ్యూటీ

‘కహో నా ప్యార్ హై’, ‘గదర్’ వంటి సినిమాలతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌ ఇమేజ్‌ తెచ్చుకుంది అమీషా పటేల్. స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను చాలాకాలం అనుభవించిన ఈ బాలీవుడ్ భామ ఇప్పటికీ సింగిల్‌గానే ఉంది. పెళ్లి చేసుకోలేదు. దానికి కారణం ఏంటో బహిరంగంగానే

Ameesha Patel: అందుకే పెళ్లి చేసుకోలేదు.. షాకింగ్ కారణం చెప్పిన బాలీవుడ్ బ్యూటీ
Ameesha Patel
Nikhil
|

Updated on: Nov 17, 2025 | 9:29 PM

Share

‘కహో నా ప్యార్ హై’, ‘గదర్’ వంటి సినిమాలతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌ ఇమేజ్‌ తెచ్చుకుంది అమీషా పటేల్. స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను చాలాకాలం అనుభవించిన ఈ బాలీవుడ్ భామ ఇప్పటికీ సింగిల్‌గానే ఉంది. పెళ్లి చేసుకోలేదు. దానికి కారణం ఏంటో బహిరంగంగానే చెప్పేసి షాకిచ్చింది. రణ్‌వీర్ అల్లాబాడియా పాడ్‌కాస్ట్‌లో ఆమె చేసిన కామెంట్లు అభిమానులతోపాటు సినీ ప్రేమికులను కూడా ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయి. తనకు సీరియస్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయని పేర్కొంది.

సినిమాల్లోకి రాకముందు సౌత్ బాంబేకు చెందిన బిగ్ ఇండస్ట్రియల్ ఫ్యామిలీ అబ్బాయితో రిలేషన్‌లో ఉన్నానని తెలిపింది అమీషా. “బ్యాక్‌గ్రౌండ్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ సెటప్ అన్నీ సమానంగా ఉన్నాయి. అన్ని విషయాల్లో సమానంగానే ఉన్నాం. కానీ సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు, పబ్లిక్‌ లైఫ్‌లో ఉన్న వాళ్లతో ఉండడానికి అతను ఇష్టపడలేదు. అందుకే కెరీర్‌ను ఎంచుకుని, ఆ రిలేషన్‌షిప్‌ను వదిలేశాను” అని వెల్లడించింది.

ప్రేమకు, పెళ్లికి తలుపులు మూసేయలేదని, సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని అమీషా చెబుతోంది. “నెవర్ సే నెవర్! సరైనవాడు దొరికితే పెళ్లి చేసుకుంటాను. అతను మౌకె పార్ చౌకా మార్‌లెగా (మంచి అవకాశాన్ని వదలడు). ఇప్పటికీ వెల్-టు-డు ఫ్యామిలీల నుంచి ప్రపోజల్స్ వస్తున్నాయి. నా వయసులో సగం ఉన్నవాళ్లు కూడా డేట్‌కు అడుగుతున్నారు. వయసు ముఖ్యం కాదు, మెంటల్ మెచ్యూరిటీ ఉండాలి. కొందరు వయసు పెద్దవారు కూడా ఫ్లై IQతో ఉంటారని చెప్పింది అమీషా.

కెరీర్, ప్రేమ రెండింటికీ సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రేమికులు కెరీర్ ప్రోస్పర్ అయ్యేలా ఎంకరేజ్ చేయాలని సలహా ఇచ్చింది. ఆమె జర్నీ ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్. తాను సీరియస్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ పెళ్లి తర్వాత ఇంట్లోనే కూర్చోవాలని, యాక్టింగ్ మానేయాలని పార్ట్‌నర్లు కోరడంతో ఆ రిలేషన్‌షిప్‌ను పెళ్లి వరకు తీసుకెళ్లలేదని చెప్పింది అమీషా పటేల్.

“స్కూల్ డేస్‌లో బాయ్స్ నన్ను చేజ్ చేసేవారు. నేను వద్దు అని చెప్పేదానిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపోజల్స్ వస్తూనే ఉన్నాయి. కానీ చాలా మంది పెళ్లి తర్వాత ఇంట్లోనే ఉండాలని, జాబ్ మానేయాలని కోరారు. అది నాకు సరిపోలేదు. నేను ముందు ‘అమీషా పటేల్’ అవ్వాలనుకున్నాను. ఇప్పటికే జీవితంలో చాలా కాలం ఎవరో కుమార్తెగా గడిపాను. పెద్దయ్యాక ఎవరో భార్యగా మాత్రమే ఉండాలని లేదు” అని అమీషా పేర్కొంది. బద్రి సినిమాలో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అమీషా.

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..