AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Tarun: ‘కాపాడే వాడే చంపడం మొదలుపెడితే’.. సరికొత్త కాన్సెప్టుతో రాజ్ తరుణ్ కొత్త సినిమా

“పగలు రాత్రి కలవకూడదు అన్నది  దైవ నిర్ణయం అయితే, కత్తి తో చావును కలపాలన్నది మానవ నిర్ణయం. రాత్రి జరిగే హత్యలకి సాక్ష్యం ఈ చంద్రుడు. వాడు ఎప్పటికి సాక్షిగా రాడు. కష్టాల్లో వున్న వాళ్ళని  కాపాడే వాడే కథానాయకుడు.  కానీ ఆ కాపాడే వాడే చంపడం మొదలు పెడితే “

Raj Tarun: 'కాపాడే వాడే చంపడం మొదలుపెడితే'.. సరికొత్త కాన్సెప్టుతో రాజ్ తరుణ్ కొత్త సినిమా
Raj Tarun Amrutha Chowdary New Movie Tortoise
Basha Shek
|

Updated on: Nov 17, 2025 | 8:34 PM

Share

రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్ గా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా “టార్టాయిస్”. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్, ఎన్ వి ఎల్ క్రియేషన్స్ పతాకం పై శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సోమవారం (నవంబర్ 17) ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగాయి. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ “”టార్టాయిస్” చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. చాలా డిఫరెంట్ కథ, దర్శకుడు రిత్విక్ కుమార్ కథ చెప్పిన విధానం చాలా బాగుంది. ఇంత మంచి కథతో వస్తున్నా మా నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు గార్లకి కంగ్రాట్స్. ఈ చిత్రం నా కెరీర్ కి మంచి కిక్ ఇస్తుంది” అని తెలిపారు.

దర్శకుడు రిత్విక్ కుమార్ మాట్లాడుతూ “మా సినిమా పూజ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు స్వాగతం. “టార్టాయిస్” చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. రాజ్ తరుణ్ గారికి కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, హీరోయిన్ అమృత చౌదరి క్యారెక్టర్స్ చాలా బలంగా ఉంటాయి. కొత్త స్క్రీన్ ప్లే తో డిఫరెంట్ కథ తో మంచి థ్రిల్లర్ చిత్రం ఇది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. ఈరోజు మా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసాం. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు గార్లకి నా ధన్యవాదాలు.

ఇవి కూడా చదవండి

నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు గార్లు మాట్లాడుతూ “మా “టార్టాయిస్” చిత్రం ఈ రోజు ప్రారంభం అయింది. మాకు కథ చాలా బాగా నచ్చింది. త్వరలో షూటింగ్ ప్రారంభం అవుతుంది. మా దర్శకుడు రిత్విక్ కుమార్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది. రాజ్ తరుణ్ గారితో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.

రాజ్ తరుణ్ కొత్త సినిమా లాంఛింగ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
HIV ఉందని పెళ్లికి నో చెప్పిన యువతి.. యువకుడు చేసిన పనికి..
HIV ఉందని పెళ్లికి నో చెప్పిన యువతి.. యువకుడు చేసిన పనికి..
భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..
భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..
బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా
బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా
బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..
బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..
జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. ఆశ దోశ అప్పడం వడ..
జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. ఆశ దోశ అప్పడం వడ..
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్