Mogali Rekulu Serial: చక్రవాకం, మొగలిరేకులు సీరియల్ సాంగ్స్ కంపోజ్ చేసింది ఎవరో తెలుసా.. ? డాక్టర్ నుంచి పాటలవైపు..
ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్స్ చక్రవాకం, మొగలిరేకులు. ఈ రెండు సీరియల్స్ ఫ్యామిలీ ప్రేక్షకులను మాత్రమే కాదు.. యూత్ ను సైతం ఫిదా చేశాయి. అప్పట్లో యువత కూడా ఎక్కువగా చూసేవారు. ఇక ఈ సీరియల్ సాంగ్స్ ఎంతగా పాపులర్ అయ్యాయో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ పాటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు.

“ఎందుకో నాకు ఈ ఆశలు… ఎందుకో నాకు ఈ ఆశలు మనసా మనసా… నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే అయినా అయినా…. నిను వీడలేనులే… నా నీడ నువ్వులే ప్రేమే నాకు కావాలని… రేగిపోతానిలా నీతో చెప్పుకోవాలని… ఆగిపోతానిలా… ఆఆ“………
“పచ్చని పసిమి విచ్చిన మిసిమి పచ్చని పసిమి విచ్చిన మిసిమి గుసగుసలాడే ఘుమఘుమలాడే కమ్మని కమ్మని వాసన చిలికి నవనవలాడే నును లేత లేత తొలి పూత పూత వసివాడి వాడిపోనీ చిగురంత ఆశ మదిలోన రేగి చిరునవ్వు మాసిపోనీ విరిసే విరిసే మొగలిరేకులు విరిసే విరిసే మొగలిరేకులు విరిసే విరిసే మొగలిరేకులు..” అంటూ వచ్చే పాటలు ఇప్పటికీ యూత్ ఫేవరేట్ సాంగ్స్. చాలా సంవత్సరాల క్రితం బుల్లితెరపై సినిమాలకు మించిన క్రేజ్ సొంతం చేసుకున్న సీరియల్స్ చక్రవాకం, మొగలి రేకులు. ఈ సీరియల్స్ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా.. టైటిల్ సాంగ్స్ సైతం భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. 80’s, 90’s కిడ్స్ కు ఈ సీరియల్స్ ఫేవరేట్. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ సీరియల్ సాంగ్స్ తెగ షేర్ చేస్తూ అప్పటి రోజులను గుర్తు చేసుకుంటారు. ఫ్యామిలీ ప్రేక్షకులే కాకుండా యూత్ సైతం ఈ ధారవాహికలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు. అయితే ఈ సూపర్ హిట్ సీరియల్స్ సాంగ్స్ కంపోజ్ చేసింది.. పాడింది ఎవరో మీకు తెలుసా.. ? కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయిన ఈ పాటలను కంపోజ్ చేసి పాడింది గాడిచర్ల సత్యనారాయణ అలియాస్ బంటీ.
ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయిన ఆయన… ఓవైపు డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ గా మారారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన నేపథ్యం, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అనే విషయాలను పంచుకున్నారు. అలాగే సీరియల్ సాంగ్స్ ఎలా వచ్చాయి అనే విషయాలను చెప్పుకొచ్చారు. తాను మొదట సింగర్, మ్యూజిషియన్ అని.. ఆ తర్వాతే డాక్టర్ అని అన్నారు. మెడిసిన్ అయ్యాక చెన్నై వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ కావాలనుకున్నానని.. కానీ కుదరకపోవడంతో హైదరాబాద్ లో క్లినిక్ పెట్టానని అన్నారు. “ఒకరోజు మా క్లినిక్ దగ్గర షూటింగ్ జరుగుతున్న సమయంలో డైరెక్టర్ మంజుల నాయుడిని మొదటిసారి చూశాను. ఒక రోజు ఆమె కొడుక్కి యాక్సిడెంట్ కావడంతో ఆవిడ భర్త నా దగ్గరకు తీసుకువచ్చారు. అప్పుడే నేను పరిచయం చేసుకుని మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి మంజుల నాయుడు అపాయిట్మెంట్ అడిగాను. ఆ తర్వాతి రోజే కలిసి నేను కంపోజ్ చేసిన పాటలు వినిపించాను.. ” అని అన్నారు.
మొదట సుశీల సీరియల్ కు ఛాన్స్ ఇవ్వడంతో సింగర్ సునీతతో టైటిల్ సాంగ్ పాడించాను. తర్వాత ఋతురాగాలు సీరియల్ ఛాన్స్ రావడంతో రచయిత బలభద్రపాత్రుని మధుని మంజుల నాయుడికి పరిచయం చేశాను. ఆయన రాసిన ‘వాసంత సమీరంలా.. నునువెచ్చని గ్ర్రీష్మాంలా..’ పాటను 15 నిమిషాల్లో మ్యూజిక్ కంపోజ్ చేసి పాట రెడీ చేశాను. కొన్ని సినిమాలకు పనిచేశాను. అలాగే చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ టైటిల్ సాంగ్స్ చేశాను. ఇటీవల శుభం సినిమాలోని పాలు నీళ్లు బంధం అనే పాటను పాడాను. దాదాపు 70 సీరియల్స్ కు పాడాను. కంపోజన్ చేశాను అంటూ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : ఆ ఒక్క జ్యూస్.. 51 ఏళ్ల వయసులో మలైక అందం వెనుక రహస్యం ఇదేనట.




