- Telugu News Entertainment Do you know these things about 'Hombale Films' which produced Kantara, KGF movies
కాంతారా, కేజీఎఫ్.. చిత్రాలను నిర్మించిన ‘హోంబలే ఫిల్మ్స్’కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
ఇటీవల కాలంలో కన్నడ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ గురించి సర్వత్రా చర్చించుకుంటున్నారు. హోంబలే ఫిల్మ్స్ గొప్పతనం ఏమిటి? ఈ సంస్థ సినీ ఇండస్ట్రీకి ఎందుకంత స్పెషల్? వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న హొంబలే విశేషాలు మీకోసం..
Updated on: Nov 10, 2022 | 8:28 PM

ఇటీవల కాలంలో కన్నడ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ గురించి సర్వత్రా చర్చించుకుంటున్నారు. హోంబలే ఫిల్మ్స్ గొప్పతనం ఏమిటి? ఈ సంస్థ సినీ ఇండస్ట్రీకి ఎందుకంత స్పెషల్? వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న హొంబలే విశేషాలు మీకోసం..

విజయ్ కిరంగదూర్, చలువే గౌడ, కార్తిక్ గౌడ ఈ ముగ్గురి సృష్టే హోంబలే ఫిల్మ్స్. ఇలవేల్పు హోంబలమ్మ కావడంతో నిర్మాణ సంస్థకు హోంబలే ఫిల్మ్స్ అని నామకరణం చేశారు.

అవగాహన రాహిత్యంతో తీసిన తొలి సినిమా ప్లాప్ అయ్యింది. పునీత్ రాజ్‌కుమార్‌తో ‘నిన్నిందలే’ ఇదీ ప్లాపే. సినిమాలపై కసితో ఏడాది తిరిగేలోపు ‘మాస్టర్‌పీస్’ అనే చిత్రాన్ని యశ్ హీరోగా తెరకెక్కించారు. ఈ చిత్రంలోనే వారి ప్రయాణం మొదలైంది. అంతేకాకుండా ‘హోంబలే’ పేరును అందరికీ పరిచయం చేసింది. ఆ తర్వాత వరుసగా రాజకుమార, యువరత్న, కేజీయఫ్ చాప్టర్ 1, కేజీయఫ్ చాప్టర్ 2, కాంతారా హోంబలే హిట్లు లిస్టులో చేరిపోయాయి.

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కథతో తెరకెక్కిన కేజీయఫ్ చాప్టర్ 1 సినిమాతో కన్నడనాట వరకు మాత్రమే పరిమితమైన వీరిపేర్లు దేశమంతా మారుమోగి పోయాయి. ‘కేజీయఫ్ చాప్టర్ 2 ఏకంగా రూ. 1250 కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత కేవలం రూ.16 కోట్లతో నిర్మించిన కాంతార ఊహించని విధంగా పాపులారిటీ పొందింది.

ప్రస్తుతం హోంబలే ప్రభాస్ హీరోగా సలార్, టైసన్, భగీర, రిచర్డ్ ఆంథోనీ, ధూమం.. చిత్రాల నిర్మాణం చేబడుతోంది.




