Shakuntalam: సమంత నటించిన శాకుంతలం రియల్ స్టోరీ ఏంటో తెలుసా.? కాళిదాసు రాసిన అద్భుత కావ్యం..
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. భారతదేశ సాహిత్య చరిత్రలో మర్చిపోలేని శకుంతల పాత్రకు గుణశేఖర్ దృశ్యరూపం అందిస్తున్నారు. 5వ శతాబ్ధంలో మహా కవి కాళిదాసు రాసిన శకుంతల పాత్రకు ప్రాణం పోశారు. ఈ సినిమాలో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో...
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. భారతదేశ సాహిత్య చరిత్రలో మర్చిపోలేని శకుంతల పాత్రకు గుణశేఖర్ దృశ్యరూపం అందిస్తున్నారు. 5వ శతాబ్ధంలో మహా కవి కాళిదాసు రాసిన శకుంతల పాత్రకు ప్రాణం పోశారు. ఈ సినిమాలో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. త్రీడిలో సైతం ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఇక ఇందులో దుర్వాస మహామునిగా మోహన్ బాబు కనిపించారు. గౌతమి, సుబ్బరాజుతో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు కీలక పాత్రల్ని పోషించారు. దీంతో శాకుంతలం కథ ఏంటన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సినిమాలా తెరకెక్కించేలా ఈ కథలో అంత ఏముందని అందరూ ఆలోచిస్తున్నారు. ఇంతకీ శాకుంతలం అసలు స్టోరీ ఏంటో మీకోసం..
విశ్వామిత్రుడు చేస్తున్న యాగాన్ని చెడగొట్టేందుకు స్వర్గలోకం నుంచి భువికి వస్తుంది మేనక. ఈ క్రమంలోనే మేనక, విశ్వామిత్రులు కూతురుకి జన్మనిస్తారు. అనంతరం మేనక స్వర్గలోకానికి వెళ్లిపోతుంది. విశ్వామిత్రుడు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వీరిద్దరి పుట్టిన శకుంతల కన్వ మహర్షి ఆశ్రమంలో పెరుగుతుంటుంది. ఒకనాడు, హస్తినాపుర రాజైన దుష్యంతుడు వేటకని వచ్చి ఆ ఆశ్రమాన్ని దర్శించుకుంటాడు. అక్కడ శకుంతలని చూసి ఇష్టపడతాడు. కన్వ మహర్షి యాత్రలో ఉండడంతో, గాంధర్వ వివాహం చేసుకుంటారు. ‘ఈ ఉంగరం మీద అక్షరాలు లెక్కపెట్టేలోపు నేను తిరిగొస్తా’ అని తన ఉంగరాన్ని ఇచ్చి రాజు రాజ్యానికి వెళ్లిపోతాడు.
శకుంతల దుష్యంతుడు కోసం ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో దుర్వాస మహార్షి వస్తాడు. అయితే దుర్వాస మహార్షి ఎంత పిలిచినా శకుంతల స్పందించదు. దీంతో శకుంతలని దుర్వాస మహార్షి శపిస్తాడు, ‘ఎవరి ఊహల్లో నువ్వు తేలుతున్నావో వాళ్ళు నిన్ను మర్చిపోతారు’ అని శపిస్తాడు. అది కూడా ఆమె వినిపించుకోదు. చెలికత్తెలే బతిమాలుకుంటారు. ఆయన కాస్త కరిగి “ఏదన్నా వస్తువు చూపిస్తే మర్చిపోయిందంతా గుర్తొస్తుంది” అని వెళ్తిపోతాడు. దుష్యంతుడు ఎంతకీ ఏ కబురూ పంపడు. విషయం తెలుసుకున్న కన్వ మహర్షే అత్తారింటికి పంపిస్తాడు.
అక్కడ దుష్యంతుడు శకుంతలని నిరాకరిస్తాడు. గుర్తుగా చూపెట్టబోయిన ఉంగరం నీటిలో పడిపోతుంది. దానిని నదిలోని ఓ చేప తినేస్తుంది. దీంతో అటు తండ్రి దగ్గరికీ వెళ్ళలేక, ఇటు భర్త ఇంట్లో స్థానం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను తల్లి మేనకే ఆదరించి మరో మహర్షి ఆశ్రమంలో ఉంచుతుంది. చేపలు పట్టేవాడికి ఒక చేప పొట్టలో రాజుగారి ఉంగరం దొరికి, అది చివరికి రాజుగారికి చేరుతుంది. దాన్ని చూసీ చూడగానే అంతా గుర్తొచ్చిన రాజు శకుంతల కోసం వెతుకుతాడు. వీరిద్దరికి పుట్టిన కుమారుడే భరతుడు అవుతాడు. చివరిగా దుష్యంతుడు శకుంతలంను, భరతుడిని కలవడంతో కథ సుఖాంతం అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..