Sai Pallavi: బ్రేక్ తీసుకుందా…? ఆఫర్లు ఆగిపోయాయా..?.. అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్
తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ భామ. తొలి సినిమాతూనే సాయి పల్లవి తన నటన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అందాల భామ సాయి పల్లవికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటించిన సినిమాలన్నీ మంచ్ విజయాలను అనుకున్నాయి. అలాగే నటనకు ప్రదన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ చిన్నది. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ భామ. తొలి సినిమాతూనే సాయి పల్లవి తన నటన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిదా మంచి విజయం సాధించడంతో వరుస సినిమాలు ఈ అమ్మడికి క్యూ కట్టాయి. దాంతో తెలుగులో ఈ అమ్మడు బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అలాగే విపరీతంమైన ఫాలోయింగ్ అందుకుంది.
ఇదిలా ఉంటే సాయి పల్లవి చివరిగా గార్గి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తర్వాత సాయి పల్లవి మరో సినిమాను ఒప్పుకోలేదు ఆమె నుంచి ఇంతవరకు కొత్త సినిమా అనౌన్స్ కాలేదు. దాంతో ఆమె అభిమానులంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సాయి పల్లవి కావాలనే సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చిందా.? లేక ఆమెకు ఆఫర్స్ ఉండటంలేదా అని .? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల నటనకు గుడ్ బై చెప్పి డాక్టర్ గా సెటిల్ అవ్వనుందని టాక్ వినిపించింది. కానీ ఈ విషయంలో వాస్తవం లేదని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది తొలి రోజు నుంచి సాయి పల్లవి ఫ్యాన్స్ ఆమె సినిమాకు సంబందించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూస్తున్నారు. ఇక ఇప్పుడు సంక్రాంతి పండగకు అయినా సాయి పల్లవి నయా మూవీ అనౌన్స్ మెంట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.