AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : 63 ఏళ్ల హీరోయిన్.. 9 కోట్లతో బడ్జెట్.. కట్ చేస్తే.. 80 కోట్ల కలెక్షన్స్‏తో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

63 ఏళ్ల వయసులో కథానాయికగా బాక్సాఫీస్ షేక్ చేసింది. ఆమె నటించిన ఒక సినిమా ఇటీవల థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందామా. అలాగే ఆ సినిమాకు ప్రస్తుతం ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

Cinema : 63 ఏళ్ల హీరోయిన్.. 9 కోట్లతో బడ్జెట్.. కట్ చేస్తే.. 80 కోట్ల కలెక్షన్స్‏తో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Thaai Kizhavi Movie
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2026 | 7:18 AM

Share

భారతీయ సినిమా ఎక్కువగా హీరోల గురించే ఉంటుంది. హీరోయిజం, యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే హీరోయిన్లు కేవలం డ్యూయెట్లు, రొమాన్స్‌కే పరిమితమైన రోజులు ఇప్పుడు నెమ్మదిగా మారాయి. ఈ మధ్యకాలంలో మహిళా కథానాయికలతో వచ్చిన సినిమాలు విజయవంతమై, చిత్ర పరిశ్రమకు స్ఫూర్తినిచ్చాయి. లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇటీవల కళ్యాణి ప్రియదర్శన్ నటించిన లోక సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. కానీ మీకు తెలుసా.. ? 63 ఏళ్ల వయసులో ప్రధాన పాత్రలో నటించిన ఒక సినిమా ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. తొలిసారిగా దర్శకత్వం వహించిన శివకుమార్ మురుగేశన్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ఆ సినిమా పేరు రాధిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తాయ్ కిళవి’. ఈసినిమా 2026 ఫిబ్రవరి 27న అడియన్స్ ముందుకు వచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

ఒక పల్లెటూరి వృద్ధురాలి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి అభిమానుల నుండి గొప్ప స్పందన లభించింది. కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ. 80 కోట్ల వరకు వసూలు చేసింది. రాధిక పౌనుతై అనే వృద్ధురాలి పాత్రను పోషించారు. ప్రస్తుతం రాధిక వయసు 63 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని ఎనర్జీ, కాన్ఫిడెన్స్, తనదైన నటనతో కట్టిపడేసింది. భర్త టార్చర్ నుంచి కూతురిని విముక్తిరాలిని చేసి తన వద్దనే పెట్టుకుంటుంది. గ్రామంలో వడ్డీకి డబ్బులు ఇచ్చి, వాటిని కఠినంగా వసూలు చేసే మహిళగా.. మొత్తం గ్రామాన్ని తన అదుపులో ఉంచుకుని, భయం, గౌరవం కలగలిసిన వ్యక్తిత్వంగా మారుతుంది. కానీ అప్పుడే ఆమె పక్షవాతానికి గురికావడంతో సినిమా అసలు మలుపులు తిరుగుతుంది. ఆమె పట్ల గ్రామంలోని ప్రజలు, తన కొడుకులు ఏవిధంగా ప్రవర్తించారు.. చివరకు ఏం జరిగిందనేది సినిమా.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

శివకార్తికేయన్ తన ఎస్.కె. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందింది. పల్లెటూరి వృద్ధురాలి పాత్రకు అవసరమైన మేకప్ నుండి, హావభావాలు, నిజమైన పల్లెటూరి అమ్మాయి పాత్ర వరకు, రాధిక మొత్తం సినిమా భారాన్ని తన భుజాలపై మోసింది. ఆమెకు జాతీయ అవార్డు రానుందని అంటున్నారు. మహిళా కథానాయికలున్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారనే సూత్రాన్ని ‘తాయ్ కిళవి’ మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..

ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..

Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!