AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం.. ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలో తెలుసా?

భానుడి భగభగలు, ఉక్కిరిబిక్కిరయ్యే ఉక్కపోతలతో జనాలను ఊపిరి సలపకుండా చేసిన రోహిణి కార్తె ముగింపు దశకు చేరుకుంది. తెలుగు పంచాంగం ప్రకారం, జూన్ 8వ తేదీ (సోమవారం) నుంచి మృగశిర కార్తె అధికారికంగా ప్రారంభం కానుంది. సూర్యుడు రోహిణి నక్షత్రం నుండి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్ని మృగశిర కార్తెగా పిలుస్తారు. ఈ కార్తె ప్రారంభమైందంటే చాలు, ఎండల తీవ్రత తగ్గి ఆకాశం మేఘావృతమౌతుంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తొలి వానలు కురవడం మొదలవుతుంది. అందుకే ఈ కార్తెను రైతులు వ్యవసాయ పనులకు శుభసూచికగా భావిస్తారు. అయితే, ఈ రోజున చేపలను ఎందుకు తినాలని చెబుతున్నారు.. దీని వెనుక గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Jun 07, 2026 | 8:29 AM

Share
మృగశిర కార్తె అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చేపల వంటకాలు. ఈ రోజున ప్రతి ఇంట్లోనూ చేపల కూర లేదా చేపల ఫ్రై వండుకోవడం ఒక ఆచారంగా వస్తోంది. ఈ రోజు చేపలు తినడం వెనుక కేవలం సంప్రదాయమే కాదు, బలమైన శాస్త్రీయ, ఆరోగ్య కారణాలు కూడా దాగి ఉన్నాయి.

1 / 5
ఎండకాలం నుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారినప్పుడు, మానవ శరీరంలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోతుంది. ఈ శీతోష్ణస్థితి మార్పుల వల్ల జ్వరం, జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు (ఆస్తమా) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

2 / 5
చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు,  ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) పెంపొందించి, బాక్టీరియా, వైరస్‌లతో పోరాడే శక్తినందిస్తాయి. అంతేకాకుండా, ఈ సీజన్‌లో చేపలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా మారి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

3 / 5
హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ కూడా ఈ మృగశిర కార్తె రోజే ప్రారంభమవుతుంది. దేశం నలుమూలల నుండి ఆస్తమా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు ఈ చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి తరలివస్తారు. 2026 పంచాంగం ప్రకారం జూన్ 8వ తేదీ రాత్రి వేళ కార్తె ప్రవేశిస్తున్నందున, అదే సమయం నుండి ఆస్తమా రోగులకు ఈ ప్రసాద పంపిణీ జరగనుంది.

4 / 5
శాకాహారులు ఈ రోజున చేపలకు ప్రత్యామ్నాయంగా బెల్లం, ఇంగువ కలిపిన మిశ్రమాన్ని లేదా చింతచిగురు వంటకాలను తింటారు. మొత్తానికి, మారే కాలానికి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్దలు ప్రవేశపెట్టిన ఒక అద్భుతమైన జీవనశైలి విధానమే ఈ మృగశిర కార్తె వేడుక.

5 / 5
Follow Us
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే..
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే..
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా వద్దా?ఇలా చేస్తే వారం పాటు తాజాగా

జూన్ 8 నుంచి మృగశిర కార్తె..ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలి?

కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా

పుల్లంగా, కారంగా.. నిమ్మకాయ పులిహోర అద్భుతంగా రావాలంటే ఇలా చేయండి

లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్.. ఆ లిస్ట్‌లో పేరు లేకుంటే రేషన్ కార్డు

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక లీటర్‌ పెట్రోల్‌ కేవలం రూ.82కే..!

రూపాయి ఖర్చులేని చిట్కా.. ఎండిపోయిన మనీ ప్లాంట్ పచ్చగా మారిపోద్ది

ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ ..

బియ్యంలో పురుగులు పడుతున్నాయా?ఈ చిన్న చిట్కాలతో సమస్యకు గుడ్‌బై !