AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క డైలాగ్ లేకుండా సైలెంట్ సీన్.. దెబ్బకు థియేటర్ మొత్తం చప్పట్లే.. ఇప్పటికీ విపరీతమైన క్రేజ్.. విశ్వనాథ్ తీసిన ఈ సినిమా తెలుసా..

డైరెక్టర్ విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి తనదైన ముద్ర వేశారు. తెలుగు సినిమా గౌరవాన్ని, సంస్కృతిని తన అద్భుతమైన సృజనాత్మకతతో శిఖరాగ్రాన నిలిపిన మేధావి ఆయన. కేవలం వినోదమే ధ్యేయంగా కాకుండా, సామాజిక అంశాలు , భారతీయ సనాతన కళల నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన చిత్రాలు సినీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి.

ఒక్క డైలాగ్ లేకుండా సైలెంట్ సీన్.. దెబ్బకు థియేటర్ మొత్తం చప్పట్లే.. ఇప్పటికీ విపరీతమైన క్రేజ్.. విశ్వనాథ్ తీసిన ఈ సినిమా తెలుసా..
Director K. Viswanath
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2026 | 9:57 AM

Share

దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్, తన చిత్రాలను కేవలం వినోద సాధనాలుగా కాకుండా, సమాజానికి మార్గదర్శకాలుగా తెలిపారు. స్వాతిముత్యం వంటి తన చిత్రాలు ఏళ్ల తర్వాత కూడా చర్చకు వస్తున్నప్పుడు, వాటిలోని ఇతివృత్తం, కథా విలువలు, నిర్మాణ శైలి, సంగీతం, సాహిత్యం, నటీనటుల ప్రదర్శన వంటివి ఇప్పటికీ నిలిచి ఉన్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆయన దృష్టిలో, తెలుగు సినిమా లేదా భారతీయ సినిమా గురించి ఒక సబ్జెక్టును బోధించాలనుకుంటే, తన చిత్రాలు సిలబస్‌లో చేర్చదగినవి. స్క్రీన్‌ప్లే, స్టోరీ, పాటలు, సంగీతం, సాహిత్యం, లొకేషన్, డైరెక్షన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వంటి అన్ని అంశాలలోనూ ప్రతి సినిమా ఒక పాఠ్యాంశంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. స్వాతిముత్యం చిత్రం లోతైన సామాజిక సందేశాన్ని కె. విశ్వనాథ్ విశ్లేషించారు. నిర్మలమ్మ పోషించిన పాత్ర ద్వారా సమాజానికి ఇచ్చిన సందేశం గురించి ఆయన ప్రస్తావించారు. నిర్మలమ్మ పాత్ర ఆ రోజుల్లోనే ఎంత ఆధునిక భావాలు కలిగి ఉందో, ఒక వితంతు వివాహాన్ని ప్రోత్సహించడం ద్వారా సమాజంలో అనాథలైన స్త్రీలకు, వారికి బిడ్డలుంటే వారికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని ఎలా చెప్పిందో వివరించారు. “కానీ మన చట్టం అది లేదే, మన సంఘం ఒప్పుకోదే” అన్నట్టుగా సమాజాన్ని ప్రశ్నించిన నిర్మలమ్మ పాత్ర, ఆచరణలోనూ, ఆలోచనలోనూ అత్యంత ఆధునికంగా ఉందని ఆయన అన్నారు. వీరభద్రరావు పాత్రతో ఆమె పాత్రకున్న వైరుధ్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కాలం చెల్లిన సంప్రదాయాలను నమ్ముతూనే, ఆధునిక ఆలోచనలతో కూడిన స్త్రీగా నిర్మలమ్మ పాత్రను తీర్చిదిద్దడం సినిమా గొప్పతనంగా పేర్కొన్నారు. కమల్ హాసన్ పాత్రలోని అమాయకత్వాన్ని, రాధిక పాత్రలోని ఆత్మవిశ్వాసాన్ని ఆయన ప్రశంసించారు, ముఖ్యంగా బిడ్డతో ఉన్న రాధికను సమాజం ఎలా చూడాలనే అంశాన్ని చిత్రంలో స్పష్టంగా చూపారని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

ఈ చిత్రంలో రొమాంటిక్ అంశాలు తక్కువగా ఉన్నప్పటికీ, అది ఒక మానవీయ కావ్యంలా నిలిచిందని కె. విశ్వనాథ్ వ్యాఖ్యానించారు. రాధిక, కమల్ హాసన్ మధ్య ప్రేమ కంటే ఒక స్వచ్ఛమైన అనుబంధం, తోడు, బాధ్యతలే ప్రధానంగా చూపబడ్డాయని ఆయన వివరించారు. సినిమాలోని అత్యంత అద్భుతమైన సన్నివేశాలలో ఒకటి – కమల్ హాసన్‌ను వీరభద్రరావు కోపంతో కొట్టే ఘట్టం. ఈ సన్నివేశం కోసం రాధిక పాత్ర ద్వారా ఒక పేజీ నిడివి గల డైలాగ్ రాశామని కె. విశ్వనాథ్ వెల్లడించారు. ఆ డైలాగ్ ద్వారా రాధిక “ఎందుకు కొడుతున్నావ్ వాణ్ణి అసలు, వాడు చేసిన తప్పేమిటి? మగాడికి ఒక రూల్ ఉందా, ఆడదానికి ఒక రూల్ ఉందా?” అంటూ సమాజాన్ని నిలదీసేలా రాసినట్లు తెలిపారు. అయితే, చిత్రీకరణకు ముందురోజు రాత్రి తనకు నిద్రపట్టలేదని, ఈ డైలాగ్ ఆ సన్నివేశం భావోద్వేగాన్ని తగ్గించవచ్చని భావించి, చివరి నిమిషంలో దానిని తొలగించాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

ఆ డైలాగ్‌కు బదులుగా, రాధిక క్యారెక్టర్ వీరభద్రరావును ఆపి, కమల్ హాసన్‌ను లేపి, కర్రను అతని చేతికి అందించే ఒక సాధారణ గెశ్చర్‌ను మాత్రమే ఉంచారు. “చప్పట్లు అండి థియేటర్లో. మొత్తం ఈ డైలాగ్ అంతా తీసేసి, ఈ గెస్చర్ ఏ పెడితే, ఎంత అప్లాజ్ థియేటర్లో” అంటూ ఆ క్షణాన్ని కె. విశ్వనాథ్ గుర్తుచేసుకున్నారు. కేవలం ఒక సైగ ద్వారా ఒక పెద్ద డైలాగ్ చెప్పిన ప్రభావాన్ని సాధించగలగడం, చివరి నిమిషంలో తీసుకున్న ఆ నిర్ణయం ఎంత గొప్ప ఫలితాన్ని ఇచ్చిందో ఆయన వివరించారు. ఈ సన్నివేశం గురించి కమల్ హాసన్ ఇప్పటికీ ప్రశంసిస్తూ ఉంటారని, అది ఎంత బాగా చిత్రీకరించబడిందో గుర్తు చేసుకుంటారని కె. విశ్వనాథ్ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..

ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..

Follow Us