Anchor varshini: గ్లామర్‌ డోస్‌ పెంచేసిన అందాల వర్షిణి.. ఆఫర్ల కోసం మరీ ఇంత అవసరమా అంటోన్న నెటిజన్లు.

బుల్లితెరపై యాంకర్ వర్షిణికి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆకట్టుకునే రూపం, నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోందీ బ్యూటీ. హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం మాత్రం ఓటీటీ వెబ్‌ సిరీస్‌లకు, బుల్లితెర షోలకు మాత్రమే..

Anchor varshini: గ్లామర్‌ డోస్‌ పెంచేసిన అందాల వర్షిణి.. ఆఫర్ల కోసం మరీ ఇంత అవసరమా అంటోన్న నెటిజన్లు.
Varshini
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 13, 2023 | 7:59 AM

బుల్లితెరపై యాంకర్ వర్షిణికి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆకట్టుకునే రూపం, నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోందీ బ్యూటీ. హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం మాత్రం ఓటీటీ వెబ్‌ సిరీస్‌లకు, బుల్లితెర షోలకు మాత్రమే పరిమితం అవుతోంది. ఢీ షోతో ఆడియన్స్‌ బాగా చేరువైందీ చిన్నది. ఒక సోషల్‌ మీడియాలోనూ వర్షిణి భారీ క్రేజ్‌ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వర్షిణిని ఏకంగా 18 లక్షల మంది ఫాలో అవుతున్నారు అంటేనే ఈ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక నిత్యం చీర కట్టులో సందడి చేస్తే ఈ బ్యూటీ తాజాగా మాత్రం గ్లామర్‌ లుక్‌లో కనిపించి అందరినీ ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది.

వర్షిణికి సంబంధించిన లేటెస్ట్‌ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. బ్లాక్‌ డ్రస్‌లో ఏదో పార్టీకి హాజరైన సమయంలో దిగిన ఫొటోలను పోస్ట్‌ చేసింది వర్షణి. దీంతో ఈ ఫొటోలకు నెట్టింట భారీ రియాక్షన్‌ వస్తోంది. ఇక మరో ఫొటో షూట్‌లో వర్షిణి గ్లామర్‌ గేట్‌లను ఎత్తేసినట్లు కనిపిస్తోంది. వీటికి లక్షల సంఖ్యలో లైక్‌లు కురిపిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు వర్షిణి అందానికి ఫిదా అవుతూ పొగుడుతూ కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు మాత్రం సినిమా ఆఫర్ల కోసం ఇలా గ్లామర్ షో చేయడం అవసరమా అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఫొటోలతో వర్షిణి మాత్రం మరోసారి ట్రెండ్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే వర్షిణి ఇప్పటి వరకు లవర్స్ , కాయ్ రాజా కాయ్ , బెస్ట్ యాక్టర్స్ వంటి చిత్రాల్లో నటించినా లీడ్‌ రోల్‌లో మాత్రం కనిపించలేదు. అయితే పెళ్లి గోల అనే వెబ్‌ సిరీస్‌తో ద్వారా తొలిసారి లీడ్‌ రోల్‌లో నటించి మెప్పించింది. ఇక వర్షిణి ప్రస్తుతం కామెడీ స్టార్స్ షో అనే ప్రోగ్రామ్‌కు యాంకర్‌గా చేస్తోంది. అయితే సినిమాల అవకాశాలు దక్కించుకునే క్రమంలోనే సోషల్‌ మీడియాలో ఇలాంటి పోస్ట్‌లు చేస్తందన్న వాదన వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..