Chiranjeevi: ఆచార్య విషయంలో ఇదే జరిగింది.. అసలు విషయం చెప్పిన మెగాస్టార్

సినిమా విషయంలో దర్శకుడు తీసుకునే శ్రద్ధపైనే సినిమా రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది అని వ్యాఖ్యలు చేశారు.

Chiranjeevi: ఆచార్య విషయంలో ఇదే జరిగింది.. అసలు విషయం చెప్పిన మెగాస్టార్
Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 13, 2023 | 7:14 AM

మెగాస్టార్ చిరంజీవి నటించిన  వాల్తేరు వీరయ్య సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇప్పటికే ప్రీమియర్స్  షోస్ పడటంతో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించనుంది. ఇదిలా ఉంటే గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరజీవి ఆచార్య సినిమా పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా విషయంలో దర్శకుడు తీసుకునే శ్రద్ధపైనే సినిమా రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది అని వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంఅందరు ఆచార్య పరాజయానికి కొరటాలే కారణం అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా మరోసారి మెగాస్టార్ ఆచార్య పై కామెంట్స్ చేయడం ఆసక్తికరకంగా మారింది.

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ..సినిమా అనేది ఎంత కావాలో అంతవరకే తెరకెక్కించాలి. ఈ విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమాకు డైరెక్టర్ ఎంతో కీలకమైన వారు. ఆయన ఒక సినిమా ఎంత నిడివి అవసరం ఆ సినిమాకు కథ ఎంత ముఖ్యం అనేది ముందుగా సిద్ధం చేసుకోవాలి .

మూడు నాలుగు గంటలు సినిమా వచ్చేలా చిత్రీకరించి దాన్ని రెండు, రెండున్నర గంటల్లో సరిపోయేలా ఉంచి మిగిలిన్నదంతా కట్ చేస్తే సినిమా కథ తికమక అవుతుంది . అలాగే నిర్మాత చాలా నష్టపోతాడు అన్నారు చిరంజీవి. అలాగే అనుకున్న బడ్జెట్ లోనేసినిమా కూడా పూర్తి అవుతుందని అప్పుడు హీరోలకు డేట్స్ ప్రాబ్లం కూడా ఉండదు అన్నారు. ఆచార్య విషయంలో ఇదే జరిగింది అంటూ వ్యాఖ్యలు చేస్తూనే ఈ వ్యాఖ్యలు చేస్తూ నేను ఈ విషయాన్ని కొరటాల శివను ఉద్దేశించి చెప్పలేదని, ప్రతి ఒక్క డైరెక్టర్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని అన్నారు చిరంజీవి.

మెంటలెక్కిస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్‏..
మెంటలెక్కిస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్‏..
లారెన్స్ బిష్ణోయ్‌కి మరో షాక్..అతని సోదరుడు అరెస్ట్..అన్నాదమ్ములు
లారెన్స్ బిష్ణోయ్‌కి మరో షాక్..అతని సోదరుడు అరెస్ట్..అన్నాదమ్ములు
ఢిల్లీ టూ న్యూయార్క్.. 16 గంటలు కాదు.. అరగంట ప్రయాణమే..
ఢిల్లీ టూ న్యూయార్క్.. 16 గంటలు కాదు.. అరగంట ప్రయాణమే..
వామ్మో.. పోలీస్‌ క్వార్టర్స్‌లో దూరిన నాగుపాము హల్ చల్.. చివరకు
వామ్మో.. పోలీస్‌ క్వార్టర్స్‌లో దూరిన నాగుపాము హల్ చల్.. చివరకు
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులకు శుభవార్త..అదేంటంటే..
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులకు శుభవార్త..అదేంటంటే..
ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది
ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది
గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. ఏపీలో 6, తెలంగాణలో 4..
గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. ఏపీలో 6, తెలంగాణలో 4..
చదివింది బీటెక్‌ చేసేది మోసం.. ఏకంగా రూ. 60 లక్షలు కొట్టేశాడు.
చదివింది బీటెక్‌ చేసేది మోసం.. ఏకంగా రూ. 60 లక్షలు కొట్టేశాడు.
విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో..
విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో..
పుష్ప 2 కోసం రష్మిక రెమ్యునరేషన్ తెలిస్తే
పుష్ప 2 కోసం రష్మిక రెమ్యునరేషన్ తెలిస్తే