AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Vamsi: శ్రీ ఆంజనేయం సినిమా ప్లాప్ కావడానికి కారణం ఇదే.. ఓపెన్ అయిన డైరెక్టర్ కృష్ణ వంశీ..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకులలో కృష్ణ వంశీ ఒకరు. ముఖ్యంగా ఆయనను అభిమానులు క్రియేటివ్ డైరెక్టర్ అని పిలుచుకుంటారు. 1995లో వచ్చిన 'గులాబీ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం సినిమా గురించి చెప్పుకొచ్చారు.

Krishna Vamsi: శ్రీ ఆంజనేయం సినిమా ప్లాప్ కావడానికి కారణం ఇదే.. ఓపెన్ అయిన డైరెక్టర్ కృష్ణ వంశీ..
Krishna Vamsi
Rajitha Chanti
|

Updated on: May 23, 2026 | 12:39 PM

Share

తెలుగు సినీ దర్శకుడు కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తెరకెక్కించిన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన విభిన్నమైన సినీ దర్శకత్వ శైలి, స్క్రిప్టింగ్ విధానం, అలాగే శ్రీ ఆంజనేయం సినిమాకు సంబంధించిన తన వ్యక్తిగత అనుభవాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. స్క్రిప్ట్ రచనలో కృష్ణవంశీ తన ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తారు. ముందుగా సిద్ధం చేసుకునే బౌండ్ స్క్రిప్ట్‌లకు బదులుగా, ఆయన షూటింగ్ స్పాట్‌లో, నటీనటులతో సంభాషించి, వారి బాడీ లాంగ్వేజ్‌, జ్ఞాపకశక్తి, నైపుణ్యాలకు అనుగుణంగా సన్నివేశాలను, సంభాషణలను రూపొందిస్తానని వెల్లడించారు. తాను “నాన్-ఫార్ములైక్” విధానంలో పనిచేస్తానని, ఇది నటుల డైలాగ్ డిక్షన్, బాడీ లాంగ్వేజ్‌, లుక్‌, ఆటిట్యూడ్‌, దుస్తులు, ప్రవర్తనా విధానం, ఇతర పాత్రలతో వారి సంభాషణలను ప్రభావితం చేస్తుందని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి :  Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..

మురారి సినిమాలోని ఒక సన్నివేశాన్ని ఉదాహరణగా పేర్కొంటూ, లక్ష్మి బాధపడే సీన్‌ను అర్ధరాత్రి ఒక ఆకస్మిక ఆలోచనగా అక్కడికక్కడే చిత్రీకరించినట్లు తెలిపారు. మహేష్, తారక్ వంటి స్టార్లతో కూడా ఇలాంటి స్పాట్ డెవలప్‌మెంట్ చేశానని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల కొన్నిసార్లు షూటింగ్ తేదీలు, సమయాలు మారవచ్చు, కానీ వాటిని తాను వృత్తిపరమైన సవాళ్లుగానే చూస్తానని చెప్పారు. “ఇది బ్యాంకు జాబా? ఇది NCC క్యాడెటా 9 టు 5 పనిచేశారా? ఇట్స్ అబౌట్ ఫీలింగ్స్” అని అన్నారు. భావోద్వేగాలు, కనెక్షన్లు ప్రధానమని ఆయన నమ్ముతున్నట్లు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

శ్రీ ఆంజనేయం సినిమా విషయానికి వస్తే, దీనికి తాను బౌండ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశానని, చిత్రరామశాస్త్రి కి చూపించి, ఆయన ముద్ర కూడా వేయించుకున్నానని కృష్ణవంశీ తెలిపారు. అయితే, చిత్రీకరణ సమయంలో, ముఖ్యంగా దైవ పాత్రలను (హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు) మనుషుల రూపంలో డీల్ చేస్తున్నప్పుడు తనకు వ్యక్తిగత సంతృప్తి లభించలేదని అంగీకరించారు. “దేవుడు మనిషి రూపంలో ఉంటే ఎలా మాట్లాడతాడు? ఎలా నిలబడతాడు, ఏం చేస్తాడు?” అనే ప్రశ్నలు, అలాగే మానవ కాలమానాలకు, దైవ కాలమానాలకు ఉన్న తేడాలు (ఉదాహరణకు, బ్రహ్మ పురాణం ప్రకారం దేవతలకు ఒక సెకను మనకు మూడు నెలలు) తనను కలవరపరిచాయని వివరించారు. ఈ అంతర్గత అసంబద్ధత కారణంగా తనకు పూర్తిస్థాయిలో నమ్మకం కుదరలేదని, అదే తన శ్రీ ఆంజనేయం అనుభవానికి సంబంధించిన ప్రధాన అంశమని కృష్ణవంశీ స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya: సౌందర్య భర్త ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. హీరోయిన్ ప్రేమ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..

Follow Us