హాట్ లుక్స్ తో మోహినిలా మత్తెక్కిస్తున్న త్రిప్తి డిమ్రీ
22 May 2026
Pic credit - Instagram
Phani Ch
ఒకే ఒక్క సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాతో ఒకేసారిగా ఫేమస్ అయ్యింది.
అందం, అభినయం, గ్లామర్ తో కట్టిపడేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం క్రితమే ఎంట్రీ ఇచ్చిన ఈ తార.. విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకుంది.
కానీ యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
2012లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది త్రిప్తి. హిందీలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ యానిమల్ సినిమాతోనే ఈ బ్యూటీకి క్రేజ్ వచ్చింది.
దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సామేతను చక్కగా ఫాలో అవుతూ ముంబయ్‌లో కాస్త గట్టిగానే ఆస్తులు కూడబెడుతోందట ఈబ్యూటీ.
యానిమల్ సినిమాతో త్రిప్తికి బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రీసెంట్ గా ఆమె ప్రభాస్ తో స్పిరిట్ సినిమా కూడా చేస్తోంది. దాంతో, ఇప్పుడు ఆమె ఫేమ్ డబుల్ అయ్యింది.
ఇక బ్లడీ రోమియో అనేది పాన్ ఇండియన్ సినిమా కాబట్టి, త్రిప్తిని తీసుకుంటే పాన్ ఇండియా మార్కెట్ కూడా కవర్ అవుతుంది కాబట్టి ఆమెను తీసుకోవాలని చూస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.