AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabaradasth : రష్మీకి జబర్దస్త్‏లో అవకాశం ఇప్పిందించి నేనే.. తమన్నాతో యాడ్ చేశాను.. టాలీవుడ్ నటుడు..

జబర్దస్త్ కామెడీ షోకు బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్స్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు జబర్దస్త్ షో ద్వారా యాంకర్ రష్మీ గౌతమ్ సైతం ఏ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారో చెప్పక్కర్లేదు. తాజాగా ఆమె ఎంట్రీ గురించి ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది.

Jabaradasth : రష్మీకి జబర్దస్త్‏లో అవకాశం ఇప్పిందించి నేనే.. తమన్నాతో యాడ్ చేశాను.. టాలీవుడ్ నటుడు..
Rashmi Gautham
Rajitha Chanti
|

Updated on: May 23, 2026 | 11:10 AM

Share

బిగ్ బాస్ విజేత కౌశల్ మందా తన సినీ ప్రస్థానంలోని విషయాలు, వ్యక్తిగత నిర్ణయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మోడలింగ్ తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో కౌశల్ వివరించారు. మోడలింగ్ అనేది కేవలం అందం గురించి మాత్రమే కాదని, ఒక పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, బాడీ లాంగ్వేజ్, ఆత్మవిశ్వాసం ఎలా పెంపొందించుకోవాలి వంటివి నేర్పిస్తుందని చెప్పారు. కౌశల్ ఇండస్ట్రీలో చాలా మందికి సహాయం చేశానని తెలిపారు. కొత్త నటీనటులకు అవకాశాలు కల్పించాలనే తపన తనకు ఉందని, డబ్బు రాకపోయినా వారు పేరు, సంపాదన పొందితే చాలని ఆయన ఉదారతను చాటుకున్నారు. అనేక మంది పెద్ద హీరోయిన్స్‌కు, హీరోలకు తెలియకుండానే తానూ సహాయం చేశానని, కొన్ని షోలకు హోస్టులుగా సజెస్ట్ చేసి వారి కెరీర్ ఎదుగుదలకు కారణమయ్యానని వెల్లడించారు. దీనికి ఒక ఉదాహరణగా యాంకర్ రష్మి ప్రస్థానాన్ని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya: సౌందర్య భర్త ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. హీరోయిన్ ప్రేమ కామెంట్స్..

జబర్దస్త్ నుండి అనసూయ బయటకు వచ్చిన తర్వాత, మేనేజర్ ఏడుకొండలు కొత్త యాంకర్ కోసం అడగగా, కౌశల్ వైజాగ్‌కు చెందిన తన స్నేహితురాలు రష్మి పేరును సూచించారు. ఆ తర్వాత రష్మి ఆడిషన్ చేసి జబర్దస్త్ యాంకర్‌గా ఎంపికయ్యారు. ఈ విషయం తాను రష్మికి ఎప్పుడూ చెప్పలేదని, మేనేజర్ కూడా క్రెడిట్ తనకే దక్కాలని భావించి ఉండవచ్చు అని కౌశల్ తెలిపారు. తన “చేయి ఇతరులకు అదృష్టమని” కౌశల్ బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. తనతో కలిసి మొదటి యాడ్ ఫిలిం చేసినవారు లేదా ర్యాంప్ షో చేసినవారు ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నారని ఆయన అన్నారు. దీనికి నిదర్శనంగా నటి తమన్నాను పేర్కొన్నారు. తమన్నా హ్యాపీ డేస్ తర్వాత తాను డైరెక్ట్ చేసిన భీమా సిమెంట్ యాడ్ ఫిలింలో నటించారని కౌశల్ గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

దాదాపు 220కి పైగా యాడ్ షూట్‌లు డైరెక్ట్ చేసిన కౌశల్, తనకంటూ ఒక చిన్న సినిమా తీయగల సామర్థ్యం వచ్చినప్పటికీ ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదో స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును సినిమాపై పెట్టి తిరిగి మొదటి నుంచి కష్టపడే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదని అన్నారు. బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివ బాలాజీ తన డబ్బునంతా సినిమా నిర్మాణంలో పెట్టి జీరో అయిన ఉదాహరణను ప్రస్తావించారు. కౌశల్ భార్య నీలిమ కూడా సినిమా పరిశ్రమలో పెట్టుబడి పెట్టడానికి వ్యతిరేకమని, అది “బూడిదలో పోసిన పన్నీరు” లాంటిదని భావిస్తుందని కౌశల్ వెల్లడించారు. సినిమాను విడుదల చేయడానికి, ప్రమోట్ చేయడానికి భారీగా డబ్బు అవసరమని, తమకు అంత సామర్థ్యం లేదని ఆయన అన్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..

కౌశిక్ ఫోటో..

Rashmi Gautham, Kaushal

Rashmi Gautham, Kaushal

ఎక్కువ మంది చదివినవి : Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..

Follow Us