Kitchen Hacks: కిచెన్ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తోందా? రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క ట్రిక్ ట్రై చేయండి!
వంటిల్లు ఎప్పుడూ శుభ్రంగా, సువాసనభరితంగా ఉంటేనే ఇల్లంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అయితే ఎంత నీట్‌గా ఉంచినప్పటికీ, చాలా మంది ఇళ్లల్లో కిచెన్ సింక్ డ్రైనేజీ పైపుల నుంచి ఒక రకమైన నీచు వాసన లేదా కుళ్లిన దుర్వాసన వస్తూ ఇబ్బంది పెడుతుంటుంది. సింక్‌లో వేసే ఎంగిలి మెతుకులు, జిడ్డు పదార్థాలు, పాచి పైపుల్లో పేరుకుపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ బ్యాడ్ స్మెల్ వల్ల వంటగదిలోకి వెళ్లడమే కష్టంగా మారుతుంది. అయితే దీనికోసం మార్కెట్లో దొరికే కెమికల్ పౌడర్లు వాడాల్సిన పనిలేదు.

కిచెన్ సింక్ పైపుల్లో చేరిన జిడ్డును వదిలించడానికి, అక్కడ చేరే బ్యాక్టీరియాను చంపడానికి ఉప్పు ఒక అద్భుతమైన నేచురల్ క్లీనర్‌గా పనిచేస్తుంది. ఉప్పును ఉపయోగించి సింక్ దుర్వాసనను ఎలా పోగొట్టాలో ఇక్కడ కొన్ని సులువైన పద్ధతులు ఉన్నాయి. మన వంటింట్లో నిత్యం ఉండే ‘ఉప్పు’ తో ఈ సమస్యకు చాలా సులభంగా, శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. ఆ అద్భుతమైన చిట్కా ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. కేవలం ఉప్పు, వేడి నీళ్లు రాత్రి పూట వంటగది పనులన్నీ పూర్తయిన తర్వాత సింక్ డ్రైన్ హోల్‌లో ఒక పెద్ద కప్పు కల్లుప్పు లేదా నార్మల్ ఉప్పును వేయాలి. ఒక 15-20 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయండి. ఆ తర్వాత ఒక లీటర్ బాగా కాగిన వేడి నీళ్లను నేరుగా ఆ పైపులోకి పోయాలి. ఉప్పు అక్కడ పేరుకుపోయిన మురికిని లూజ్ చేస్తే, వేడి నీళ్లు ఆ జిడ్డునంతటినీ కరిగించి కిందకు పంపేస్తాయి. దీనివల్ల బ్యాడ్ స్మెల్ క్షణాల్లో మాయమవుతుంది.
2. ఉప్పు, బేకింగ్ సోడా కాంబినేషన్: దుర్వాసన చాలా ఎక్కువగా ఉన్నప్పుడు.. అర కప్పు ఉప్పు, అర కప్పు బేకింగ్ సోడా కలిపి సింక్ రంధ్రంలో వేయాలి. ఆ వెంటనే ఒక కప్పు వైట్ వెనిగర్ లేదా నిమ్మరసం పోయాలి. ఇవి మూడూ కలిసినప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ జరిగి నురగ వస్తుంది. ఇది పైపుల గోడలకు పట్టిన మురికిని, బ్యాక్టీరియాను పూర్తిగా క్లీన్ చేస్తుంది. అరగంట తర్వాత వేడి నీళ్లతో ఫ్లష్ చేస్తే సరిపోతుంది.
3. ఐస్ ముక్కలు, ఉప్పు ట్రిక్: పైపులలో జిడ్డు గట్టిగా పేరుకుపోతే.. గుప్పెడు ఉప్పుతో పాటు కొన్ని ఐస్ ముక్కలను సింక్ రంధ్రంలో వేసి కాసేపు ఉంచాలి. ఐస్ ముక్కలు పైపుల్లోని జిడ్డును గడ్డకట్టేలా చేస్తే, ఉప్పు దాన్ని స్క్రాప్ చేసి (రుద్ది) బయటకు పంపడానికి సహాయపడుతుంది.
ఈ చిట్కాలు పాటించడం వల్ల కలిగే లాభాలు:
బ్యాక్టీరియా నశిస్తుంది: ఉప్పులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు పైపుల్లో చేరే హానికర బ్యాక్టీరియాను, ఫంగస్‌ను నశింపజేస్తాయి.
క్రీమికీటకాలు రావు: ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటించడం వల్ల సింక్ పైపుల ద్వారా పైకి వచ్చే బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు, ఈగలు రాకుండా అడ్డుకోవచ్చు.
పైపులు బ్లాక్ అవ్వవు: డ్రైనేజీ పైపుల్లో ఆయిల్ పేరుకుపోయి బ్లాక్ అయ్యే సమస్య కూడా తప్పుతుంది.
ఇకపై మీ కిచెన్ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తే వెంటనే ఈ ఉప్పు చిట్కాను ట్రై చేసి చూడండి!
