Trending Folk: ఏముంది మావ ఈ పాట.. యూట్యూబ్, ఇన్ స్టాలో దుమ్మురేపుతుంది.. మళ్లీ మళ్లీ వినాలనిపించే ఫోక్ సాంగ్..
ప్రస్తుతం తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గ్రామాల్లో సరదాగా పాడుకునే పాటలే ఇప్పుడు నెట్టింటిని ఊపేస్తున్నాయి. ఎక్కడ చూసిన ఈ పాటల హావా కనిపిస్తుంది. ఏ వేడుక అయినా.. ఎలాంటి పార్టీ అయినా ఫోక్స్ సాంగ్స్ ఉండాల్సిందే అన్న స్థాయికి చేరుకుంది. ఇక ఇన్ స్టా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ప్రస్తుతం తెలంగాణ పల్లె పాటలు యూట్యూబ్ ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. సినిమా పాటల కంటే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంటూ నెట్టింట దూసుకుపోతున్నాయి. ఈమధ్యకాలంలో ఈ పాటలకు వస్తున్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రతి పాట యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. తాజాగా మరో సాంగ్ నెట్టింట రచ్చ చేస్తుంది. పాడుకోవడానికి సులభంగా ఉండే సాహిత్యం.. మెంటలెక్కించే మాస్ బీట్ తో సాగుతున్న ఈ పాటకు ఇప్పుడు చిన్నా, పెద్దా నెట్టింట స్టెప్పులేస్తున్నారు. ఎటు చూసిన ఈ పాట వినిపిస్తుంది. ముఖ్యంగా డీజేలో ఈ పాట మారుమోగుతుంది. గ్రామాల్లోనే కాదు.. పట్టణాల్లోనూ ఫోక్ సాంగ్స్ మారుమోగుతుండగా.. ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకుంటున్న ఈ ఫోక్ సాంగ్ గురించి తెలిసుసుకుందామా.
ఎక్కువ మంది చదివినవి : Soundarya: సౌందర్య భర్త ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. హీరోయిన్ ప్రేమ కామెంట్స్..
ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్. “సన్న సన్న బియ్యమే” (Sanna Sanna Biyyame). ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈపాటలో ఎప్పటిలాగే మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి తమ ఎనర్జిటిక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, కెమిస్ట్రీతో ప్రేక్షకులను కట్టిపడేశారు. శిరీష, గంగమణి ఎంతో అద్భుతంగా ఆలపించారు. పక్కా పల్లెటూరి వాతావరణాన్ని, బావా-మరదళ్ల మధ్య సాగే అందమైన లోకల్ ముచ్చట్లను ఈ పాటలో ఎంతో చక్కగా ఆవిష్కరించారు. “సన్న సన్న బియ్యమే మదానో నా వయ్యారి.. సరువల్ల వంటలే మదానో నా వయ్యారి” అంటూ సాగే ఈ పాట ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
కేవలం విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సాంగ్ లక్షలాది వ్యూస్, వేలాది లైకులతో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. రీల్స్, షార్ట్స్‌లో కూడా ఈ పాట ఆడియో తెగ వైరల్ అవుతోంది. మే 20న విడుదలైన ఈ పాటకు ఇప్పటికీ రికార్డ్ స్థాయిలో వ్యూస్ రావడం విశేషం. ఇంతకీ ఆ పాటను మీరు విన్నారా… అయితే ఓ లుక్కేయ్యండి మరీ.
ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..
ట్రెండింగ్ ఫోక్ సాంగ్ వినేయండి..
ఎక్కువ మంది చదివినవి : Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..
