హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న పొడుగు కాళ్ళ సుందరి.. ఫరియా పిక్స్ పీక్స్

22 May 2026

Pic credit - Instagram

Phani Ch

ఫరియా అబ్దుల్లాప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ పొడుగుకాళ్ల సుందరి.

తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అమాయకంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది ఫరియా అబ్దుల్లా.

ఆతర్వాత ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. అలాగే స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.

బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నాగార్జున, నాగ చైతన్యతో కలిసి స్టెప్పులేసింది ఈ బ్యూటీ. ఆతర్వాత తిరిగి హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసింది.

మత్తువదలరా 2, ఆ ఒక్కటే అడక్కు మూవీస్ లో నటించినా పెద్దగా కలిసి రాలేదు. రీసెంట్ గా గాయపడ్డ సింహం మూవీలో నటించింది.

కెరీర్ టర్న్ అయ్యే ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్న ఫరియా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు గ్లామర్ గేట్లు ఎత్తేస్తుంది.