F3 Movie: ఆర్ఆర్ఆర్ కోసం ఎఫ్‌3ని వాయిదా వేస్తాం.. దిల్‌రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

F3 Movie: క‌రోనా థార్డ్ వేవ్ కార‌ణంగా భారీ చిత్రాలు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. వీటిలో దిల్ రాజు నిర్మాత‌గా తెర‌కెక్కిన ఎఫ్‌3 చిత్రం కూడా ఉంది. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఎఫ్‌3 చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించిన...

F3 Movie: ఆర్ఆర్ఆర్ కోసం ఎఫ్‌3ని వాయిదా వేస్తాం.. దిల్‌రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 30, 2022 | 11:09 AM

F3 Movie: క‌రోనా థార్డ్ వేవ్ కార‌ణంగా భారీ చిత్రాలు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. వీటిలో దిల్ రాజు నిర్మాత‌గా తెర‌కెక్కిన ఎఫ్‌3 చిత్రం కూడా ఉంది. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఎఫ్‌3 చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ట్విట్ట‌ర్ వేదిక‌గా శ‌నివారం చిత్ర యూనిట్ ఈ విష‌యాన్ని తెలిపింది. అయితే కాసేప‌టికే నిర్మాత దిల్‌రాజు ఎఫ్3 విడుద‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

దిల్ రాజు నిర్మాణంలో ఇటీవ‌ల తెర‌కెక్కిన రౌడీ బాయ్స్ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్న నేప‌థ్యంలో దిల్‌రాజు శ‌నివారం మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగానే ఎఫ్‌3 సినిమా విడుద‌ల‌పై ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఆ సంద‌ర్భంగా దిల‌ర్ రాజు మాట్లాడుతూ.. ‘వచ్చే నెల మూడో వారం నుంచి కరోనా తీవ్రత తగ్గి పెద్ద సినిమాల విడుదలకు మార్గం సుగమం అవుతుందనే ఆశిస్తున్నాం. క‌రోనా నేప‌థ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర యూనిట్ రెండు విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించింది. ఒక‌వేళ ఆర్ఆర్ఆర్ ఏప్రిల్ 28కి వాయిదా ప‌డితే. ఎఫ్‌3 వాయిదా ప‌డొచ్చు’ అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.

దీనికి కార‌ణంగా పాన్ ఇండియా మూవీ అయిన ఆర్ఆర్ఆర్‌కు అధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని దిల్ రాజు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల విష‌యమై ఆయ‌న మాట్లాడుతూ ఫిబ్ర‌వ‌రిలోపు ప‌రిష్కారం ల‌బిస్తుంద‌నే న‌మ్మకంతో ఉన్న‌ట్లు తెలిపారు. ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని దిల్ రాజు అన్నారు.

Also Read: QR కోడ్‌ స్కాన్ చేస్తున్నారా జాగ్రత్త.. ఒక్క పొరపాటు మీ ఖాతాని ఖాళీ చేస్తుంది..?

Sucess story:సేద్యం కోసం పిహెచ్ డీ వదిలి విదేశం నుంచి స్వదేశం వచ్చిన యువతి.. నేడు లక్షల్లో సంపాదన..

News Watch LIVE : AP PRC పై దేనికైనా రెఢీ..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..(వీడియో)