Sucess story:సేద్యం కోసం పిహెచ్ డీ వదిలి విదేశం నుంచి స్వదేశం వచ్చిన యువతి.. నేడు లక్షల్లో సంపాదన..
Sucess story:కాశ్మీర్(Kashmir)కు చెందిన ఇన్షా రసూల్(Insha Rasool) దక్షిణ కొరియా(South Korea)లో చేస్తోన్న PhDని విడిచిపెట్టి.. స్వదేశమైన భారత కు వ్యవసాయం చేయడానికి వచ్చింది.
Sucess story:కాశ్మీర్(Kashmir)కు చెందిన ఇన్షా రసూల్(Insha Rasool) దక్షిణ కొరియా(South Korea)లో చేస్తోన్న PhDని విడిచిపెట్టి.. స్వదేశమైన భారత కు వ్యవసాయం చేయడానికి వచ్చింది. సేంద్రీయ కూరగాయలను విక్రయించే హోమ్‌గ్రీన్స్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించింది. మీకు చాలా తక్కువ తెలిసిన అభిరుచిని కొనసాగించడం కోసం స్థిరమైన పనిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా…. ఈ ప్రశ్న ఇన్షా రసూల్ కు PhD చేస్తున్నప్పుడు సమయంలూ ఎదురైంది. దీంతో తనకు ఆరు నెలల సమయం ఇవ్వాలని… తాను సేంద్రీయ వ్యవసాయంలో విజయం సాధించకపోతే.. తిరిగి దక్షిణ కొరియాలోని విశ్వవిద్యాలయానికి తిరిగి వస్తానని తన ప్రొఫెసర్‌తో చెప్పింది, అలా 2018 లో దక్షిణ కొరియా నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని తన స్వస్థలమైన బుద్గామ్‌కు తిరిగి వచ్చింది.
ఆ సమయంలో ఆమెకు ఉన్నదంతా పూర్వీకుల నుంచి వారసత్వంగా ఉన్న 3.5 ఎకరాల భూమి. ఈ భూమిలో ఇంట్లో వాడుకోవడానికి పంటలు , కూరగాయలు పండించేవారు. ఇన్షా చుట్టుపక్కల ఉన్న రైతుల వద్దకు వెళ్లి.. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువును కొనుగోలు చేసింది. వ్యవసాయ పనులను చేయడానికి కూలీలను నియమించింది. వృత్తి రీత్యా శాస్త్రవేత్త తనకు వ్యవసాయం చేయడానికి ఉన్న అవగాహన సరిపోదని తెలుసు.. దీంతో వివిధ సీజన్లలో లభించే వివిధ రకాల విత్తనాలతో నెలల తరబడి ప్రయోగాలు చేసింది.
మొదట్లో అనేక వైఫల్యాలు.. కొన్నిసార్లు విత్తనాలు మొలకెత్తలేదు, ఎరువు పనిచేయదు, కొన్నిసార్లు పంటకు నీరు ఎక్కువ.. లేదా విత్తనాలు తప్పుడు సీజన్ లో నాటడం ఇలా అనేక ప్రయోగాలు చేస్తూ ఆరునెలలు దాటిపోయాయి. అయినప్పటికీ తిరిగి చదువు కోసం దక్షిణకొరియా వెళ్ళాలనుకోలేదు.. వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాను.. ఈ నిర్ణయం నా జీవితాన్ని మార్చేసిందని ఇన్షా ది బెటర్ ఇండియాతో చెప్పారు .
గత రెండేళ్లుగా ఇన్షా తన కష్టపడి నిర్మించుకున్న ‘ఫార్మ్-టు-ఫోర్క్’ బ్రాండ్ హోమ్‌గ్రీన్స్ ప్రారంభానికి ఆ నిర్ణయమే తొలి అడుగు. మొదటిసారిగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రయత్నించే వ్యక్తుల గురించి ది బెటర్ ఇండియా (TBI) లో తాను చదివిన కథనాలను స్పూర్తిగా తీసుకున్నట్లు తెలిపింది ఇన్షా.. అందుకంటే వ్యవసాయంలో నష్టపోయినప్పటికీ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. “అప్పట్లో, వ్యవసాయం చేయడంపై అవగాహన, మార్గదర్శకత్వం లేదు.. దీంతో నేను TBI కథనాలను చదివాను వాటిని అనుసరిటు పొలంలో పంటలు పడించడం ప్రారంభించాను అని చెప్పారు. ఇన్షా ఇప్పుడు ఇన్షా తన వైఫల్యాలను, ప్రయోగాలను ఉత్సాహంగా పంచుకుంటుంది, భవిష్యత్తులో ఇతరులకు సహాయపడతానని చెప్పారు.
ఆరోగ్యకరమైన జీవనశైలి: బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పూర్వ విద్యార్థి ఇన్షా పచ్చదనం, తక్కువ ఉష్ణోగ్రతలతో చాలా ప్రదేశాలలో నివసించారు. కాశ్మీర్, ఢిల్లీ ,బెంగళూరులో నివసించిన తర్వాత, ఆమె దక్షిణ కొరియాకు వెళ్లింది, అక్కడ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంది. ఆమె కుటుంబం వ్యవసాయంలో ఉన్నప్పటికీ, ఆమె తన పిల్లలు చదువుకునే స్కూల్ లో చేపట్టిన కార్యక్రమలో భాగంగా స్ట్రాబెర్రీ పొలాన్ని సందర్శించిన తర్వాత వ్యవసాయం పై ఆసక్తిని కనబరిచింది. రంగురంగుల స్ట్రాబెర్రీలను పండించడానికి వారు ఉపయోగించిన అద్భుతమైన సాంకేతికతకు ఆశ్చర్యపోయాను. కాశ్మీర్‌లో ఎవరైనా ఇలాగే చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో అంటూ తన భర్తతో క్యాజువల్‌గా అభిప్రాయాన్ని పంచుకునట్లు ఇన్షా చెప్పింది. విదేశీయులు పండించే పంటలను ఎంచుకుని సేద్యంలోకి దిగింది.
భూమిలో ఎప్పుడూ ఒకే పంట వేయడానికి బదులుగా బహుళ పంటలను వేసింది. త్వరగా పెరిగే కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, మూలికలు, మెంతులు మొదలైన పంటలతో భూమిలో ఎ మాత్రం ఖలీలేకుండా వ్యవసాయం చేయడం ప్రారంభించింది. తెగుళ్ల నివారణకు అంతర పంటల పద్ధతిని కూడా అవలంబించింది, కూరగాయల మధ్య వెల్లుల్లి, సాధారణ రేగుట వంటి తెగుళ్లను నియంత్రించే మొక్కలను పెంచుతుంది. పురుగుల మందులుగా వేపనూనె, మిరపకాయ, ఉల్లిపాయలు , వెల్లుల్లి వంటి వాటిని పులియబెట్టిన మిశ్రమాన్ని ఉపయోగిస్తుంది. పండిన పంటను ఇన్షా తన ఇన్‌స్టాగ్రామ్ , ఫేస్‌బుక్ పేద్వారా విక్రయిస్తుంది . పోస్ట్‌ను అప్‌లోడ్ చేసిన 24 గంటల్లోనే చాలా వరకూ అమ్ముడవుతాయని పేర్కొంది.
“నేను గత నవంబర్ , డిసెంబర్‌లలో దాదాపు 8 లక్షల రూపాయలు సంపాదించాను. ఫ్రెంచ్ బీన్స్,బఠానీలు మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయని తెలిపింది. ఇన్షా చాలా అంకితభావం, వినూత్నమైన రైతు. ఆమె రైతులకు సరైన ధరను పొందడంలో సహాయపడటమే కాకుండా తాజా వ్యవసాయ పద్ధతులలో శిక్షణ ఇస్తుంది. గతంలో రైతులు బ్రకోలీని కిలో రూ.30కి అమ్మేవారు. ఇప్పుడు వారు రూ. 100 పొందుతున్నారు” అని రాష్ట్ర వ్యవసాయ శాఖ నోడల్ ఆఫీసర్ షమాస్ సుల్ హసన్మీర్ ది బెటర్ ఇండియాతో చెప్పారు. ఇన్షా త్వరలో పౌల్ట్రీ విభాగాన్ని ప్రారంభించాలని ..మరిన్ని పంటలను పండించాలని భూమిని కొనుగోలు చేయాలనీ భావిస్తోంది.
Photo courtesy To thebetterindia
Also Read: