AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Pickle: ఆంధ్రా స్టైల్ లో అద్భుతమైన రుచితో చేపల నిల్వ పచ్చడిని తయారు చేసుకోండి ఇలా..

Fish Pickle: నాన్ వెజ్ ను ఇష్టపడే వారిలో సీఫుడ్ లవర్స్ (Sea Food Lovers)వెరీ వెరీ స్పెషల్. రొయ్యలు , చేపలు, పీతలు ఇలా ఎన్ని రకాల సీఫుడ్స్ ఉన్నా.. ఒక ప్రత్యెక స్థానం సొంతం చేసుకున్నాయి

Fish Pickle: ఆంధ్రా స్టైల్ లో అద్భుతమైన రుచితో చేపల నిల్వ పచ్చడిని తయారు చేసుకోండి ఇలా..
Fish Pickle
Surya Kala
|

Updated on: Jan 30, 2022 | 10:16 AM

Share

Fish Pickle: నాన్ వెజ్ ను ఇష్టపడే వారిలో సీఫుడ్ లవర్స్ (Sea Food Lovers)వెరీ వెరీ స్పెషల్. రొయ్యలు , చేపలు, పీతలు ఇలా ఎన్ని రకాల సీఫుడ్స్ ఉన్నా.. ఒక ప్రత్యెక స్థానం సొంతం చేసుకున్నాయి చేపలు. ఈ చేపల్లో కొవ్వు తక్కువ.. ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాలు ఎక్కువ. వారంలో రెండుసార్లయినా చేపలు తింటే..ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. చేపలను తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ లాంటివి కంట్రోల్‌ వంటి అనేక వ్యాధుల బారి నుంచి రక్షించుకోవచ్చు, ఈ చేపలలో ఎన్ని రకాలు ఉన్నాయో.. అలాగే వీటిని కూర, పులుసు, వంటి ఆహారపదర్ధలనే కాదు.. నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. ఈ రోజు ఆంధ్ర స్టైల్ లో ఈజీగా టేస్టీగా చేపల నిల్వ పచ్చడి తయారీ విదానం తెలుసుకుందాం..

చేపల నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్ధాలు:

చేప-1/2 కిలోల నూనె సరిపడా (1 కప్పు) ఎండు ఎర్ర మిరపకాయ- 2 జీలకర్ర-1 టీస్పూన్ పసుపు -1/2 టీస్పూన్ అల్లం & వెల్లుల్లి పేస్ట్-1/2 టీస్పూన్ జీలకర్ర పొడి-1/2 టీస్పూన్ ఎర్ర కారం- 3 టీస్పూన్ ధనియాల పొడి-1 టీస్పూన్ ఉప్పు- రుచికి సరిపడా నిమ్మరసం – ఒక చెక్క

తయారీ విధానం: ముందుగా చేపలు శుభ్రం చేసుకుని .. దానిలో నిమ్మరసం, పెరుగు వేసుకుని శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి.. డీప్ ఫ్రై అయ్యేలా నూనె వేసుకుని వేడి ఎక్కిన తర్వాత చేపలు వేసుకుని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకుని చేప ముక్కలను ఓ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో ఎందు మిర్చి జీలకర్ర, వేసుకొని వేయిన్చుకోవాలి. తర్వాత నూనె చల్లార్చి అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి. అందులో ముందుగా వేయించిన చేప ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక బౌల్ లోకి తీసుకుని దానిలో నిమ్మ రసం కొంచెం వేసుకోవాలి. అంతే సింపుల్ గా టేస్టీగా ఉండే చేపల నిల్వ పచ్చడి రెడి. ఈ పచ్చడిని తడి తగలకుండా నిల్వ చేసుకుంటే దాదాపు ౩ నెలలు నిల్వ ఉంటుంది.

Also Read:  సేద్యం కోసం పిహెచ్ డీ వదిలి విదేశం నుంచి స్వదేశం వచ్చిన యువతి.. నేడు లక్షల్లో సంపాదన..