Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ira Khan: ముసలిదైపోయింది అంటూ ఆమిర్ ఖాన్ కూతురిని దారుణంగా దూషించిన నెటిజన్.. హిత బోధ చేసిన ప్రముఖ సింగర్..

సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్నే నష్టాలున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల్లో తరచూ ట్రోల్స్ (Trolling) కు గురవుతుంటారు. కొందరు నెటిజన్లు అదే పనిగా సినిమా తారలను టార్గెట్ గా చేసుకుని విమర్శలు, నెగెటివ్ కామెంట్లు చేస్తుంటారు.

Ira Khan: ముసలిదైపోయింది అంటూ ఆమిర్ ఖాన్ కూతురిని దారుణంగా దూషించిన నెటిజన్.. హిత బోధ చేసిన ప్రముఖ సింగర్..
Follow us
Basha Shek

|

Updated on: Jan 30, 2022 | 9:19 AM

సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్నే నష్టాలున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల్లో తరచూ ట్రోల్స్ (Trolling) కు గురవుతుంటారు. కొందరు నెటిజన్లు అదే పనిగా సినిమా తారలను టార్గెట్ గా చేసుకుని విమర్శలు, నెగెటివ్ కామెంట్లు చేస్తుంటారు. తాజాగా ఆమిర్ ఖాన్ (AAmirkhan) కూతురు ఇరాఖాన్ (Ira Khan) మరోసారి ట్రోలర్స్ బారిన పడింది. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ఆమెని తీవ్రంగా దూషించాడు. తన లుక్స్, శరీర సౌష్టవం (body Shaming) , ఆకృతి గురించి అసభ్యకర కామెంట్లు చేశాడు.  అయితే ఇరాఖాన్ ఈ విమర్శలపై స్పందించ లేదు కానీ ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనా మొహపాత్ర ఈ కామెంట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఆ సదరు ఆకతాయి సోనా కామెంట్ కి రిప్లైగానే ఇరాను ఇన్ని మాటలన్నాడు.

‘ఆమె కళ్లకింద చూడు’ అంటూ..

అసలు విషయంలోకి వెళితే .. ఇరాఖాన్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. తన గ్లామర్, ఫ్యాషనబుల్ ఫొటోలతో పాటు ఆరోగ్యం, డిప్రెషన్, మానసిక ఆరోగ్యంపై తరచూ మాట్లాడుతూ ఆ సమస్యలపై అవగాహన కల్పిస్తూ ఉంటుంది. ఈ విషయంలో చాలామంది ఆమెకు సపోర్ట్ గా నిలుస్తుంటే కొందరు మాత్రం నెగెటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.  తాజాగా మానసిక ఆరోగ్యం గురించి ఇన్ స్టాగ్రామ్ వేదికగా మరోసారి మాట్లాడింది ఇరా. దీనికి బాలీవుడ్ గాయని సోనా మొహాపాత్ర స్పందిస్తూ ‘ గుడియా( బొమ్మలా బాగున్నావ్)’, డాలీ’ అంటూ ఇరాను ప్రశంసించింది.  అయితే  సోనా కామెంట్లపై ఓ నెటిజన్ రెచ్చిపోయాడు . ‘సోనా .. ఇరా నీకు డాలీలా కనిపిస్తోందా?’ అని కామెంట్ చేశాడు. అంతటితో ఆగక ‘ ఆమె కళ్లకింద నల్లటి మరకలు చూడు.. అప్పుడే ముసలిదానిలా కనిపిస్తోంది. ఆమె  ముఖం చూశావా.. పంది లాంటి ఫేస్ తనది’ అంటూ అసభ్యకరంగా దూషించాడు.

నీ తల్లిదండ్రులకు తలవంపులు తీసుకురావద్దు..

ఇరాపై నెటిజన్ చేసిన ఈ కామెంట్లకు సోనాకు చిర్రెత్తుకొచ్చింది.  తనదైన శైలిలో ఆ ఆకతాయిని ఉతికారేసింది. ‘ నీకు ఎలాంటి పని ఉండడం లేదు. అందుకే ఇలా వాగుతున్నావు. నీ బతుకంతా ఓటమే.  ఆ విసుగునంతా ఇక్కడ విషం రూపంలో మాపై వెళ్లగక్కుతున్నావ్. వెళ్లి ఏదైనా పని చేసుకో.. గౌరవంతో బతకడం నేర్చుకో.. ఇలా బతుకుతూ నీ తల్లిదండ్రులకు  తలవంపులు తీసుకు రావద్దు’ అంటూ ఘాటుగా హితభోద చేసింది.  కాగా ఈ విషయంలో ఇరాఖాన్, సోనాలకు సోషల్ మీడియాలో భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. చాలామంది వీరికి సపోర్టుగా నిలుస్తున్నారు.

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

Also Read:Rashmi Gautam: ఢిల్లీలోని ఆ జూను బ్యాన్ చేయాలంటోన్న బుల్లితెర బ్యూటీ.. కారణమేంటంటే..

Pushpa: క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తోన్న ‘పుష్ప’ ఫీవర్.. శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పును అశ్విన్ ఎలా అనుకరించాడో మీరే చూడండి..

Megastar Chiranjeevi: క్వారంటైన్ లో కెమెరాకు పని చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. కవిత్వం కూడా అల్లేశారు..

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్