AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తోన్న ‘పుష్ప’ ఫీవర్.. శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పును అశ్విన్ ఎలా అనుకరించాడో మీరే చూడండి..

ఐకాన్ స్టార్  అల్లు అర్జున్(Allu Arjun) నటించిన 'పుష్ప' (Pushpa)  క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. గతేడాది డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఇందులోని డైలాగులు, పాటలు, డ్యాన్సులైతే సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి

Pushpa: క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తోన్న 'పుష్ప' ఫీవర్.. శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పును అశ్విన్ ఎలా అనుకరించాడో మీరే చూడండి..
Basha Shek
|

Updated on: Jan 30, 2022 | 7:26 AM

Share

ఐకాన్ స్టార్  అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa)  క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. గతేడాది డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఇందులోని డైలాగులు, పాటలు, డ్యాన్సులైతే సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. విదేశాల్లోని ప్రముఖ సింగర్లు, మ్యూజిక్ బ్యాండ్లు సైతం ఈ సినిమాల్లోని పాటలు, డైలాగులను తమదైన శైలిలో రీక్రియేట్ చేస్తున్నారు. ఇక క్రికెట్ ప్రపంచాన్ని ‘పుష్ప’ ఫీవర్ వెంటాడుతోంది.  టీమిండియా క్రికెటర్లు రవీంద్ర జడేజా, శిఖర్‌ ధావన్‌, సురేశ్‌ రైనా, హార్దిక్‌ పాండ్యా తో పాటు విదేశీ క్రికెటర్లు పుష్పరాజ్ ను అనుకరిస్తున్నారు.  ఇక ఆస్ట్రేలియా క్రికెటర్‌  డేవిడ్ వార్నర్ అయితే రోజుకో ‘పుష్ప’ వీడియోను షేర్ చేస్తూ ఈ సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఇప్పుడు టీమిండియా సీనియర్ ఆటగాడు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.

బన్నీని కాపీ కొట్టకుండా భలే చేశావ్..

ఈ సందర్భంగా పుష్పలోని శ్రీవల్లి  పాటలో బన్నీ వేసిన సిగ్నేచర్ స్టెప్పును  తనదైన శైలిలో రీక్రియేట్ చేశాడు అశ్విన్. అందరిలా కాకుండా బ్యాట్ చేత పట్టి వెరైటీగా డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో కాలి చెప్పు ఊడిపోయినా సరే ఎంతో ఏకాగ్రతగా స్టెప్పు పూర్తి చేశాడు. . ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పలువురు క్రికెటర్లు, అభిమానులు లవ్, హార్ట్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్ ని నింపేస్తున్నారు. ఈ వీడియోపై స్పందించిన టీమిండియా ఫీల్డింగ్ మాజీ కోచ్  ఆర్‌ శ్రీధర్‌ ‘తగ్గేది లేదు’  అని కామెంట్‌ చేశాడు. అదేవిధంగా ‘బన్నీని కాపీ కొట్టకుండా  భలే డ్యాన్స్ చేశావు అవూ’ అంటూ స్టార్ స్పిన్నర్ ను పొగిడేస్తున్నారు. మరి అందరినీ ఆకట్టుకుంటోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.<

View this post on Instagram

A post shared by Ashwin (@rashwin99)

Also Read: Megastar Chiranjeevi: క్వారంటైన్ లో కెమెరాకు పని చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. కవిత్వం కూడా అల్లేశారు..

Rashmi Gautam: ఢిల్లీలోని ఆ జూను బ్యాన్ చేయాలంటోన్న బుల్లితెర బ్యూటీ.. కారణమేంటంటే..

Watch Video: లైవ్ మ్యాచులో భూకంపం.. 20 సెకన్ల పాటు దద్దరిల్లిన స్లేడియం.. వీడియో వైరల్