Watch Video: లైవ్ మ్యాచులో భూకంపం.. 20 సెకన్ల పాటు దద్దరిల్లిన స్డేడియం.. వీడియో వైరల్
Earthquake: మైదానంలోని కెమెరాలు షేక్ అవుతున్నాయి. మ్యాచ్ వ్యాఖ్యాతలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ, ఆటగాళ్లకు మాత్రం ఇది తెలియకపోవడంతో మ్యాచ్‌లో లీనమయ్యారు.
ICC U-19 World Cup: క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో వర్షం సాధారణం. కొన్నిసార్లు ఇసుక తుఫానులు కూడా కనిపించాయి. కానీ, మ్యాచ్ (Earthquake in Cricket Match) సమయంలో భూకంపం మాత్రం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ, అది జరిగింది. అది కూడా వెస్టిండీస్(West Indies) లో జరుగుతున్న ICC అండర్-19 ప్రపంచ కప్ (ICC U-19 World Cup 2022) సమయంలో జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే.. భూకంపం ధాటికి మైదానం కంపించినా, స్టేడియంలోని కెమెరాలు కదిలినా.. ఆటగాళ్లకు ఏమాత్రం తెలియకపోవడంతో మ్యాచ్ కొనసాగింది. ఇదంతా జనవరి 29 శనివారం జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ అండర్-19 జట్ల మధ్య జరుగుతున్న ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో జరిగింది. ఈ భూకంపం ఘటన కెమెరాకు చిక్కగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
అండర్-19 ప్రపంచకప్‌లో 9వ స్థానం కోసం ప్లే ఆఫ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఐర్లాండ్, జింబాబ్వే మధ్య శనివారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఈ భూకంపం సంభవించింది. జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరో ఓవర్ జరుగుతుండగా, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ మైదానంలో అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. ఆటగాళ్లకు ఈ విషయం తెలియదు. బౌలర్ తన బంతిని ఎలాంటి అవగాహన లేకుండా బౌల్ చేశాడు. బ్యాట్స్‌మన్ సులభంగా ఆడాడు.
మైదానం 20 సెకన్ల పాటు వణుకుతూనే ఉంది. ఆటగాళ్లెవరికీ తెలియలేదు. అయితే, మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కోసం గ్రౌండ్‌లో అమర్చిన కెమెరా కదలడం ప్రారంభించింది. దాదాపు 20 సెకన్ల పాటు చాలా బలమైన ప్రకంపనలు సంభవించాయి. కెమెరా వేగంగా కదులుతూనే ఉంది. అదే సమయంలో, ఈ మ్యాచ్ కామెంటేటర్స్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. కామెంటరీ బాక్స్ పూర్తిగా వణుకుతున్నట్లు, రైలు తమ వెనుక నుంచి వెళ్లిపోయినట్లు భావించినట్లు చెప్పారు. అయితే, ఆటగాళ్లు దీనిని గుర్తించలేకపోవడం విశేషం.
కొంత సమయం తరువాత, ఐర్లాండ్ క్రికెట్ కూడా భూకంపం వచ్చిందని ట్వీట్ చేయడం ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. ట్వీట్ ప్రకారం, ట్రినిడాడ్ తీరానికి సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చింది.
ఐర్లాండ్ బౌలర్ గట్టి షాక్ ఇచ్చాడు.. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని, పోటీపై ఎలాంటి ప్రభావం చూపలేదని తేలింది. జింబాబ్వే 5 వికెట్లు తీసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇన్నింగ్స్‌ను పూర్తి చేసింది. అయితే, ఐర్లాండ్ బౌలర్ ముజమ్మిల్ షెర్జాద్ తన మీడియం పేస్‌తో జింబాబ్వే బ్యాటింగ్‌ను ఇబ్బందిపెట్టాడు. ముజమ్మిల్ 7.4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడంతో జింబాబ్వే ఇన్నింగ్స్ 166 పరుగులకే కుప్పకూలింది.
Earthquake at Queen’s Park Oval during U19 World Cup match between @cricketireland and @ZimCricketv! Ground shook for approximately 20 seconds during sixth over of play. @CricketBadge and @NikUttam just roll with it like a duck to water! pic.twitter.com/kiWCzhewro
— Peter Della Penna (@PeterDellaPenna) January 29, 2022
? You may have heard chatter on the commentary today about an earthquake at the Under-19s World Cup match between Ireland and Zimbabwe.
That wasn’t just the effects from #theBlarneyArmy at the ground celebrating a wicket, it was a 5.1 magnitude quake just off Trinidad’s coast! pic.twitter.com/0PISiyqdaN
— Cricket Ireland (@cricketireland) January 29, 2022
Ravi Shastri: నేను అలా చేసినప్పుడు ప్రజలు నన్ను చూసి నవ్వారు.. టీమిండియా మాజీ కోచ్ వ్యాఖ్యలు..