Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు డ‌బుల్ ట్రీట్‌.. కేజీయ‌ఫ్ బాట‌లోనే స‌లార్‌.. అస‌లు విష‌యం ఏంటంటే..

Prabhas: బాహుబ‌లి సినిమా ప్ర‌భాస్ క్రేజ్‌ను ఒక్క‌సారిగా పెంచేసింది. దీంతో ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఓ సినిమాలో న‌టిస్తున్నాడంటే అది ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీకి వార్త‌గా మారుతోంది. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సైతం ప్ర‌భాస్ క్రేజ్‌ను వాడుకునే పనిలో ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే..

Prabhas: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు డ‌బుల్ ట్రీట్‌.. కేజీయ‌ఫ్ బాట‌లోనే స‌లార్‌.. అస‌లు విష‌యం ఏంటంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 30, 2022 | 7:28 AM

Prabhas: బాహుబ‌లి సినిమా ప్ర‌భాస్ క్రేజ్‌ను ఒక్క‌సారిగా పెంచేసింది. దీంతో ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఓ సినిమాలో న‌టిస్తున్నాడంటే అది ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీకి వార్త‌గా మారుతోంది. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సైతం ప్ర‌భాస్ క్రేజ్‌ను వాడుకునే పనిలో ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా ప‌లు చిత్రాలు లైన్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. వీటిలో కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న స‌లార్ చిత్రం ఒక‌టి. ఇందులో ప్ర‌భాస్‌కు జోడిగా శృతీ హాస‌న్ న‌టిస్తోంది. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై ఇండియ‌న్ సినిమా దృష్టి ప‌డింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ వార్త సారాంశం ప్ర‌కారం స‌లార్ చిత్రాన్ని రెండు పార్టులుగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌శాంత్ కేజీఎఫ్‌ను కూడా రెండు పార్ట్స్‌గా విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. కేజీఎఫ్‌లాగే స‌లార్ చిత్ర క‌థ‌ను కూడా ఒక పార్ట్‌లో పూర్తి చేయ‌డం సాధ్యం కాద‌ని భావించిన చిత్ర యూనిట్ సినిమాను రెండు పార్టులుగా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో సినిమా, సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు త‌మ హీరోను బ్యాక్ టు బ్యాట‌క్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూసుకునే అవ‌కాశం ద‌క్క‌నుంద‌న్న‌మాట‌.

ఇదిలా ఉంటే ఇటీవ‌ల సౌత్ ఇండియ‌న్ సినిమాల్లో ఈ రెండు పార్టులు ఒక స‌క్సెస్ ఫార్ములాగా ప‌నిచేస్తున్నట్లు క‌నిపిస్తోంది. సినిమాను రెండు పార్టుల్లో విడుద‌ల చేయ‌డం వ‌ల్ల పాత్ర‌ల‌న్నింటికీ అధిక ప్రాధాన్యత ఇవ్వ‌డంతో పాటు క‌లెక్ష‌న్ల ప‌రంగా కూడా పెట్టిన పెట్టుబ‌డికి రిట‌ర్న్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. బాహుబ‌లితో మొద‌లైన ఈ ట్రెండ్ కేజీయ‌ఫ్‌, పుష్ఫ చిత్రాల వ‌ర‌కు కొన‌సాగింది. మ‌రి ఈ జాబితాలో స‌లార్ కూడా చేరుతుందో లేదో తెలియాలంటే అధికారిక ప్ర‌ట‌కన వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: NeoCov: నియోకోవ్‌ వైరస్‌ మనుషులకు ముప్పుగా మారనుందా..? శాస్త్రవేత్తల సమాధానం ఏమిటి..?

Viral: 70 ఏళ్ల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారును తోలుతున్న యూకే పెద్దమనిషి!

PM Narendra Modi: భారత్-ఇజ్రాయిల్‌ మధ్య సంబంధం చరిత్రలో నిలుస్తుంది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా