QR కోడ్‌ స్కాన్ చేస్తున్నారా జాగ్రత్త.. ఒక్క పొరపాటు మీ ఖాతాని ఖాళీ చేస్తుంది..?

QR Code: ఆధునిక యుగంలో టెక్నాలజీ వల్ల చెల్లింపులు చేయడం చాలా సులభంఅయిపోయింది. బిల్లు చెల్లింపు, వస్తువుల కొనుగోలు,

QR కోడ్‌ స్కాన్ చేస్తున్నారా జాగ్రత్త.. ఒక్క పొరపాటు మీ ఖాతాని ఖాళీ చేస్తుంది..?
Qr Code
Follow us

|

Updated on: Jan 30, 2022 | 9:38 AM

QR Code: ఆధునిక యుగంలో టెక్నాలజీ వల్ల చెల్లింపులు చేయడం చాలా సులభం అయిపోయింది. బిల్లు చెల్లింపు, వస్తువుల కొనుగోలు, ఆటో-క్యాబ్‌తో సహా ప్రతిదానికీ QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా సులభంగా చెల్లిస్తున్నారు. అంతేకాకుండా డిజిటల్ చెల్లింపులు కూడా సింపుల్‌గా అయిపోతున్నాయి. దీనివల్ల దాదాపు అందరికి సమయం ఆదా అవుతుంది. కేవలం ఒక క్లిక్‌తో నగదు బదిలీ జరిగిపోతుంది. QR కోడ్ ద్వారా డబ్బు లావాదేవీలు సులభంగా జరుగుతున్నాయి కానీ దానివల్ల కొన్ని మోసాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా ఆన్‌లైన్ చెల్లింపు చేస్తే మీరు కొన్ని విషయాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలా చేయకపోతే మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవచ్చు.

QR కోడ్‌ని స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్త

డబ్బు విత్‌ డ్రా చేయడానికి QR కోడ్ ఉపయోగపడదని గుర్తుంచుకోండి. కేవలం చెల్లింపుల కోసం మాత్రమే. QR కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత మీరు ఏదైనా యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి లింక్‌ని పొందుతున్నట్లయితే వెంటనే అవైడ్‌ చేయండి. ఏ యాప్‌ను డౌన్‌లోడ్ చేయవద్దు. నిజానికి QR కోడ్ ఒక రకమైన స్టాటిక్ ఇమేజ్. ఇది హ్యాక్ చేయబడదు. చాలా సార్లు కొన్ని చెల్లింపులు విఫలమవుతాయి. ఈ పరిస్థితిలో హ్యాకర్లు దీనిని సద్వినియోగం చేసుకుంటారు. మీకు QR కోడ్‌ను మెస్సేజ్‌ ద్వారా పంపి దానికి చెల్లింపులు చేయాలని చెబితే అస్సలు చేయకండి. అది సురక్షితం కాదు. పొరపాటున కూడా అలాంటి QR కోడ్‌లను స్కాన్ చేయవద్దు.

డబ్బును స్వీకరించడానికి QR కోడ్‌ని ఉపయోగించవద్దు

షాపింగ్ మాల్, పెట్రోల్ పంప్ లేదా కూరగాయల దుకాణం, ఎక్కడైనా సరే QR కోడ్ ద్వారా చెల్లింపు సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే ఈ సమయంలో గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ఇది చెల్లింపు చేయడానికి మాత్రమే. డబ్బు తీసుకోవడానికి కాదని గుర్తుంచుకోండి.

QR కోడ్ అంటే ఏమిటి?

QR కోడ్ అనేది ఉత్పత్తి సమాచారం దాగిన ఒక నమూనా. స్కానింగ్ ద్వారా అందులో దాగి ఉన్న సమాచారం గుర్తిస్తారు. అంటే QR కోడ్‌లో ఏదైనా ప్రత్యేక టెక్స్ట్,URL, ఏదైనా మొబైల్ నంబర్‌ కూడా దాచవచ్చు. అయితే QR కోడ్ పూర్తి రూపం క్విక్ రెస్పాన్స్ కోడ్. దీన్ని చేయడం ముఖ్య ఉద్దేశ్యం చెల్లింపును సులభతరం చేయడం. ఎవరు చూడకుండా సెకన్లలో చెల్లింపులు పూర్తి చేయాలి. అంతేకానీ గంటలు తరబడి అందరు చూసేవిధంగా ఎప్పుడు చేయకూడదు.

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్యాసింజర్, స్కూల్ బస్సులలో అవి తప్పనిసరి..?

ఎల్‌ఐసీలో మీ డబ్బు నిలిచిపోయిందా.. పాలసీ డబ్బులు రీఫండ్‌ కావడం లేదా.. ఇలా చేయండి..?

భార్యాభర్తలకు నెలకు రూ. 10,000 పెన్షన్.. తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి..?