Petrol Diesel Price: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. కొన్ని చోట్ల మాత్రం స్వల్పంగా తగ్గాయి..
Petrol Diesel Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సుమారు మూడు నెలలుగా ఇంధన ధరల్లో మార్పులు కనిపించకపోవడం విశేషం. అయితే ఆదివారం కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంధన ధరల్లో స్వల్ప తగ్గుదుల కనిపించింది..
Petrol Diesel Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సుమారు మూడు నెలలుగా ఇంధన ధరల్లో మార్పులు కనిపించకపోవడం విశేషం. అయితే ఆదివారం కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంధన ధరల్లో స్వల్ప తగ్గుదుల కనిపించింది. ఇదిలా ఉంటే ముడి చమురు ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ పెరుగుదల ప్రభావం వినియోగదారులపై ఎప్పుడు పడుతుందోతననే చర్చలు జరుగుతున్నాయి. ఆదివారం దేశంలోని పలు నగరాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41 ఉండగా, డీజిల్ రూ. 86.67 గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.98 కాగా, డీజిల్ రూ. 94.14 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా, డీజిల్ రూ. 91.43 కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం లీటర్ పెట్రోల్ ధర రూ. 100.58 కాగా, డీజిల్ రూ. 85.01 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 గా ఉండగా, డీజిల్ రూ. 94.62 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 110.51 కాగా, డీజిల్ రూ. 96.59 గా ఉంది.
* సాగరతీరం విశాఖపట్నంలో ఆదివారం లీటర్ పెట్రోల్ ధర రూ. 109.05 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ రూ. 95.18 గా ఉంది.
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. కేజీయఫ్ బాటలోనే సలార్.. అసలు విషయం ఏంటంటే..