ఎల్‌ఐసీలో మీ డబ్బు నిలిచిపోయిందా.. పాలసీ డబ్బులు రీఫండ్‌ కావడం లేదా.. ఇలా చేయండి..?

LIC Money: ఎల్‌ఐసీలో కొన్ని సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించిన తర్వాత అనుకోని పరిస్థితులలో పాలసీ చెల్లించడం ఆపివేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది.

ఎల్‌ఐసీలో మీ డబ్బు నిలిచిపోయిందా.. పాలసీ డబ్బులు రీఫండ్‌ కావడం లేదా.. ఇలా చేయండి..?
Lic
Follow us
uppula Raju

|

Updated on: Jan 30, 2022 | 8:44 AM

LIC Money: ఎల్‌ఐసీలో కొన్ని సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించిన తర్వాత అనుకోని పరిస్థితులలో పాలసీ చెల్లించడం ఆపివేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. ఇన్ని రోజులు కట్టిన మీ డబ్బులు నిలిచిపోతాయి. ఈ డబ్బులు తిరిగి రావడానికి చాలామంది ప్రయత్నించి విఫలమవుతుంటారు. అలాంటివారికి సింపుల్‌ ప్రాసెస్‌ ఉంది. అటువంటి రికవరీ ఫండ్‌ను క్లెయిమ్ చేయడానికి ఎవరైనా LIC సైట్‌ని సందర్శించి దాన్ని సులభంగా తనిఖీ చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఎల్‌ఐసి వెబ్‌సైట్‌లో మీ పాలసీ వివరాలను నమోదు చేయడం. క్లెయిమ్ చేయని డబ్బులో డెత్ క్లెయిమ్ , మెచ్యూరిటీ క్లెయిమ్, సర్వైవల్ బెనిఫిట్, ఇండెమ్నిటీ క్లెయిమ్ లేదా ప్రీమియం రీఫండ్ ఉంటాయి. మీరు LIC నుంచి అటువంటి డబ్బు తీసుకోవాలనుకుంటే LIC వెబ్‌సైట్‌కి వెళ్లి క్లెయిమ్ చేసుకోవచ్చు.

అన్నింటిలో మొదటిది, LIC నుంచి డబ్బు తీసుకోవడానికి ఏ వివరాలను నమోదు చేయాలో తెలుసుకోవాలి. దీని కోసం ముఖ్యంగా 4 వివరాలు నమోదు చేయాలి. LIC పాలసీ నంబర్, పాలసీదారు పేరు, పుట్టిన తేదీ, పాన్ కార్డ్ నంబర్. ఈ నాలుగింటి సమాచారం ఇచ్చిన తర్వాత, ఎల్‌ఐసిలో మీ ట్రాప్ అయిన డబ్బుకు సంబంధించిన పూర్తి వివరాలు అందుతాయి.

పని కేవలం రెండు దశల్లో జరుగుతుంది

మొదటి దశలో మీరు LIC లింక్‌ని సందర్శించాలి . రెండో దశలో అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత ఓకె బటన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీ స్టేటస్ తెలుస్తుంది. ఆ తర్వాత డబ్బు తీసుకునే ప్రక్రియను ప్రారంభించాలి. దీని కోసం KYC ఇవ్వాలి. అభ్యర్థించిన పత్రాలను కూడా సమర్పించాలి. బీమా పాలసీ కోసం ఎంత డబ్బు తీసుకున్నా ఆ మొత్తం పాలసీకి లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని గుర్తుంచుకోండి. ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ద్వారా LIC ఈ డబ్బును లబ్ధిదారుడి ఖాతాకు పంపుతుంది.

క్లెయిమ్ చేయని ఖాతాను ఏమంటారు?

మీ పాలసీ మెచ్యూర్ అయ్యిందని అనుకుందాం అయితే దాని డబ్బు 10 సంవత్సరాలుగా విత్‌ డ్రా చేయలేదు. ఆ డబ్బు అలాగే ఉంటే అది క్లెయిమ్ చేయని ఖాతాలోకి వెళ్లిపోతుంది. క్లెయిమ్ చేయని డబ్బు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్‌కు వెళ్తుంది. దేశంలోని సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం ఈ నిధిని ఏర్పాటు చేశారు. మీ డబ్బులో ఏదైనా క్లెయిమ్ లేకుండా నిలిచిపోయినట్లయితే LIC వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా దాన్ని తనిఖీ చేయాలి. తనిఖీ చేసిన తర్వాత క్లెయిమ్ చేయడానికి KYC చేయాల్సి ఉంటుంది. అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన తర్వాత మీ డబ్బు తిరిగి చెల్లిస్తారు.

IRDAI అన్ని బీమా కంపెనీలకు క్లెయిమ్ చేయని ఖాతాలు, డబ్బు గురించి పూర్తి సమాచారాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేసింది.1000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ క్లెయిమ్ ఉన్నట్లయితే పూర్తి సమాచారం ఇవ్వాలి. క్లెయిమ్‌కు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ దాని పూర్తి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఇవ్వాలి. క్లెయిమ్ చేయని డబ్బును 25 సంవత్సరాల వరకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్‌కు బదిలీ చేయవచ్చు.

భార్యాభర్తలకు నెలకు రూ. 10,000 పెన్షన్.. తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి..?

SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులు అలర్ట్‌.. ఫిబ్రవరి 1 నుంచి ఈ సేవలకు బాదుడే..?

U19 World Cup 2022: సెమీ ఫైనల్‌లో భారత్‌కి టఫ్ పోరు.. ఎవరితో తలపడనుందో పూర్తి షెడ్యూల్‌ తెలుసుకోండి..?