SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులు అలర్ట్‌.. ఫిబ్రవరి 1 నుంచి ఈ సేవలకు బాదుడే..?

SBI Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 'తక్షణ చెల్లింపు సేవ' లేదా IMPS ఛార్జీని పెంచుతోంది. పెరిగిన కొత్త రేటు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. బ్యాంక్ బ్రాంచ్‌లో IMPS ద్వారా చేసే నగదు బదిలీకి

SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులు అలర్ట్‌.. ఫిబ్రవరి 1 నుంచి ఈ సేవలకు బాదుడే..?
Imps Charges
Follow us
uppula Raju

|

Updated on: Jan 30, 2022 | 7:55 AM

SBI Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ‘తక్షణ చెల్లింపు సేవ’ లేదా IMPS ఛార్జీని పెంచుతోంది. పెరిగిన కొత్త రేటు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. బ్యాంక్ బ్రాంచ్‌లో IMPS ద్వారా చేసే నగదు బదిలీకి ఎక్కువ ఛార్జీ విధిస్తుంది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త IMPS ఛార్జీని అమలు చేస్తున్నామని బ్యాంక్ తెలిపింది. IMPS ద్వారా 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పంపితే ఇప్పుడు 20 రూపాయలు కలిపి GST చెల్లించాల్సి ఉంటుందని తెలియజేసింది. IMPS అనేది ఒక ప్రముఖ చెల్లింపు సేవ. ఇందులో నిధులు ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొక బ్యాంకు ఖాతాకు సెకన్లలో బదిలీ అవుతాయి. ఈ సేవ అతి పెద్ద లక్షణం ఏంటంటే ఇది వారంలో ఏడు రోజులు పని చేస్తుంది. నిధుల బదిలీ సెలవు దినాలలో కూడా జరుగుతుంది.

SBI పాత స్లాబ్‌లు, దానిలోని IMPS ఛార్జీలు కొనసాగుతాయి. పాత స్లాబ్‌లో రూ.1,000 వరకు నగదు బదిలీకి ఎలాంటి ఛార్జీ లేదు. IMPS రూ.1,000 నుంచి రూ.10,000 వరకు రూ. 2తో పాటు GST చెల్లించాలి. రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు ఉన్న IMPSపై రూ. 4 ప్లస్ GST చెల్లించాలి. IMPS రూ.1,00,000 నుంచి రూ.2,00,000 వరకు రూ.12తో పాటు GST చెల్లించాలి. స్టేట్ బ్యాంక్ ఇందులో రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు కొత్త స్లాబ్‌ను కలపింది. ఈ మొత్తంలో IMPSపై 20 రూపాయలు GST చెల్లించాలి. దీని కొత్త నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది.

IMPS ఛార్జ్ అంటే ఏమిటి

భారతదేశంలో IMPS నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా NPCI ద్వారా ప్రారంభించారు. ఈ సేవలో ఇన్‌స్టంట్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ అంటే దేశంలో ఎక్కడికైనా కొన్ని సెకన్లలో డబ్బు పంపవచ్చు. IMPS అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, బ్యాంక్ బ్రాంచ్, ATM, SMS, IVRS వంటి విభిన్న మాధ్యమాల ద్వారా ఏకకాలంలో యాక్సెస్ చేయగల బ్యాంకింగ్ సేవ. దేశవ్యాప్తంగా బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ అధీకృత చెల్లింపు సాధనం జారీచేసేవారు IMPS సౌకర్యాన్ని అందిస్తారు.

డబ్బు బదిలీ ఎలా చేయాలి..?

IMPS నుంచి నగదు బదిలీ సందేశం తక్షణమే SMS ద్వారా అందుతుంది. మీరు ఆదివారాలు, సెలవు దినాలలో కూడా ఈ సేవను పొందవచ్చు. దీని కోసం మీరు మొబైల్ నంబర్, మొబైల్ మనీ ఐడెంటిఫైయర్ లేదా బ్యాంక్ ఖాతా, IFSC కోడ్ లేదా ఆధార్ కలిగి ఉండాలి. IMPS చెల్లింపు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లేదా ATM ద్వారా చేయవచ్చు. అక్టోబర్ 2021లో, రిజర్వ్ బ్యాంక్ IMPS ద్వారా డబ్బు పంపే పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది. IMPS ప్రస్తుతం డబ్బు బదిలీకి అత్యంత విశ్వసనీయ మాధ్యమంగా ఉంది.

U19 World Cup 2022: సెమీ ఫైనల్‌లో భారత్‌కి టఫ్ పోరు.. ఎవరితో తలపడనుందో పూర్తి షెడ్యూల్‌ తెలుసుకోండి..?

IND vs WI: T20 సిరీస్‌కి జట్టుని ప్రకటించిన వెస్టిండీస్‌.. 16 మంది ఆటగాళ్ల ఎంపిక..

Ayurveda: ఆయుర్వేదం ప్రకారం భోజన నియమాలు మీకు తెలుసా..?