Edible Oil: వినియోగదారులకు షాక్.. త్వరలో పెరగనున్న వంట నూనె ధలు..!
Edible Oil: గత రెండేళ్లుగా భారీగా పెరిగిన వంట నూనె ధరలు.. ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టాయి. గత నాలుగైదు నెలల నుంచి వంట..
Edible Oil: గత రెండేళ్లుగా భారీగా పెరిగిన వంట నూనె ధరలు.. ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టాయి. గత నాలుగైదు నెలల నుంచి వంట నూనె ధలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ధరలు తగ్గడంతో సామాన్యుడికి ఊరట కలిగించాయి. ఇక రానున్న రోజుల్లో వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా ఉంది. ఈ కారణంగా వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే గత కొన్నేళ్లుగా ధరల పెరుగుదలతో ఇబ్బందులకు గురైన ప్రజలకు గత నాలుగైదు నెలల నుంచి ధరలు తగ్గంతో కొంత ఊరట కలిగించింది. కానీ మున్ముందు ధరలు పెరిగే అవకాశాలున్నాయని అంచనా ఉండటంతో మళ్లీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అయితే ఈ ధల పెరుగుదలకు ప్రధాన కారణం ఇండోనేసియా. ఆ దేశం వంట నూనె ఎగుమతులను తగ్గించుకోవాలని భావిస్తోంది. దీని ద్వారా దేశీయంగా వినియోగదారులకు ఊరట కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా ఇండియాకు వంట నూనె దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ధరలు పెరిగే అవకాశం ఉంది. భారత్‌కు ఎక్కువ శాతం పామాయిల్‌ను ఇండోనేసియా నుంచి దిగుమతి అవుతోంది. మన దేశానికి పామాయిల్ దిగుమతిలో 60 శాతం వాటా ఇండోనేసియాదే ఉంటుంది.
అయితే ఇండోనేసియా నుంచి దిగుమతులు తగ్గిన కూడా ఇతర దేశాల నుంచి దిగుమతులను పెంచుకోవాలని ఇడిబుల్ ఆయిల్ పరిశ్రమ భావిస్తోంది. ఇక మాలేసియా నుంచి ఎడిబుల్ ఆయిల్ దిగుమతులను పెంచుకోవాలని భావిస్తోంది. అయితే తగినంత పామాయిల్‌ను మలేసియా నుంచి దిగుమతి చేసుకోవడం కష్టమైన పని అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు దేశంలో ఆవ నూనె ధర దిగి వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి: