AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Restrictions: ఆ బ్యాంకులపై ఆర్బీఐ నిషేధం.. ఖాతాదారులు రూ.1 లక్ష కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు

RBI Restrictions: ఇండియన్ మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్‌ (Indian Mercantile Cooperative Bank)పై రిజర్వ్ బ్యాంక్ అనేక ఆంక్షలు విధించింది..

RBI Restrictions: ఆ బ్యాంకులపై ఆర్బీఐ నిషేధం.. ఖాతాదారులు రూ.1 లక్ష కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు
Subhash Goud
|

Updated on: Jan 29, 2022 | 6:03 AM

Share

RBI Restrictions: ఇండియన్ మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్‌ (Indian Mercantile Cooperative Bank)పై రిజర్వ్ బ్యాంక్ అనేక ఆంక్షలు విధించింది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI).అందులో విత్‌డ్రా (Cash Withdrawl) పరిమితిపై కూడా ఆంక్షలు (Restrictions) విధించింది. ఇప్పుడు బ్యాంకు నుండి లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని విత్‌డ్రా చేయడం సాధ్యం కాదు. రిజర్వ్ బ్యాంక్ ( RBI ) ఈ నిబంధనలు శుక్రవారం నుండి అమలులోకి వచ్చాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం.. ఇండియన్ మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్‌ ((Cooperative Bank)పై జారీ చేసిన ఆంక్షలు వచ్చే 6 నెలల పాటు కొనసాగుతాయి. ఆ తర్వాత వాటిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకోబడుతుంది. ఈ వారం ప్రారంభంలో, రిజర్వ్ బ్యాంక్ నియంత్రణ సమ్మతిలో లోపాల కోసం ఎనిమిది సహకార బ్యాంకులకు జరిమానా విధించింది .

రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం ఏమిటి?

లక్నోకు చెందిన సహకార బ్యాంకు అనుమతి లేకుండా ఎలాంటి రుణం లేదా అడ్వాన్స్‌ను మంజూరు చేయడం లేదా అడ్వాన్స్‌ను పునరుద్ధరించడం సాధ్యం కాదని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు అనుమతి లేకుండా ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా బ్యాంకుపై నిషేధం విధించింది. అదే సమయంలో, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా, సేవింగ్స్ ఖాతాదారులు లేదా కరెంట్ ఖాతా ఉన్నవారు అనే తేడా లేకుండా బ్యాంకు ఖాతాదారులందరూ ఒక లక్ష రూపాయల వరకు మాత్రమే విత్‌డ్రా చేయగలరని తెలిపింది. అయితే, ఈ ఆంక్షలు బ్యాంకు లైసెన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపబోవని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సహకార బ్యాంకు తన బ్యాంకింగ్ వ్యాపారాన్ని పరిమితులతో కొనసాగించగలదని, పరిస్థితులకు అనుగుణంగా సెంట్రల్ బ్యాంక్ ఈ సూచనలలో మార్పులను కూడా పరిగణించవచ్చని RBI తెలిపింది.

8 సహకార బ్యాంకులకు జరిమానా

ఈ వారం ప్రారంభంలో, రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఎనిమిది సహకార బ్యాంకులకు జరిమానా విధించింది. , అసోసియేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సూరత్ (గుజరాత్) ఆర్బీఐ ఆదేశాలను పాటించనందుకు రూ.4 లక్షల జరిమానా విధించింది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్, 2014లోని కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు వరచా సహకరి బ్యాంక్ లిమిటెడ్, సూరత్‌కు లక్ష రూపాయల జరిమానా విధించబడింది. KYC నిబంధనలకు సంబంధించిన కొన్ని సూచనలను పాటించనందుకు మొగవీరా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబైకి రూ. 2 లక్షల జరిమానా విధించబడింది. పాల్ఘర్‌లోని వసాయ్ జనతా సహకారి బ్యాంక్‌పై కూడా రూ.2 లక్షల జరిమానా విధించారు. ఇది కాకుండా, రాజ్‌కోట్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్, రాజ్‌కోట్, భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, జమ్ము సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జమ్ము మరియు జోధ్‌పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్, జోధ్‌పూర్‌లకు జరిమానా విధించబడింది.

ఇవి కూడా చదవండి:

SBI Rules Change: మారిన ఎస్‌బిఐ సర్వీస్ రూల్స్.. ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి.. పూర్తి వివరాలివే..

Banking News: మూడవ త్రైమాసికంలో ఆ బ్యాంకు లాభాలు రెట్టింపు.. జనవరిలో పెరిగిన చార్జీలు..!