AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Rules Change: మారిన ఎస్‌బిఐ సర్వీస్ రూల్స్.. ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి.. పూర్తి వివరాలివే..

SBI Rules Change: భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI).. లావాదేవీల(Transactions)..

SBI Rules Change: మారిన ఎస్‌బిఐ సర్వీస్ రూల్స్.. ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి.. పూర్తి వివరాలివే..
Shiva Prajapati
|

Updated on: Jan 28, 2022 | 3:12 PM

Share

SBI Rules Change: భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI).. లావాదేవీల(Transactions) నిబంధనల్(Rules)లో కీలక మార్పులు చేసింది. ఎస్‌బిఐ ఐఎంపీఎస్(IMPS) లావాదేవీలపై పరిమితిని పెంచింది. ఎస్‌బిఐ కస్టమర్లు డిజిటల్ మార్గంలో చేసే రూ. 5 లక్షల వరకు చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేసే లావాదేవీలకు ఈ నిబంధన వర్తి్స్తుందని ఎస్‌బిఐ ప్రకటించింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది. IMPS, NEFT, RTGS తో సహా ఆన్‌లైన్ లావాదేవీలకు సంబంధించిన ఎస్‌బిఐ కస్టమర్లకు ఇది వర్తిస్తుందని బ్యాంకు పేర్కొంది.

SBI IMPS, NEFT, RTGS రూల్స్‌లో మార్పులు.. డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను అనుసరించేలా కస్టమర్లను ప్రోత్సహించే లక్ష్యంతో రూ. 5 లక్షల వరకు లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలను విధించడం లేదని ఎస్‌బిఐ తాజా ప్రకటనలో పేర్కొంది. ఇక బ్రాంచ్ ద్వారా జరిపే లావాదేవీలకు సంబంధించిన సేవల్లో ఎలాంటి మార్పులు లేవని ఎస్‌బిఐ స్పష్టం చేసింది. అయితే, కొత్తగా రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కొత్త స్లాబ్‌ను తీసుకువచ్చారు. ఈ స్లాబ్‌కు ప్రతిపాదిత సేవా ఛార్జీలు రూ.20+జీఎస్‌టీ గా నిర్ణయించారు. ఈ ఛార్జీలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.

IMPS, NEFT, RTGS లావాదేవీలపై ఎస్‌బిఐ కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి.. ఎస్‌బిఐ ఐఎంపీఎస్ ఛార్జీలు-ఆన్‌లైన్ మోడ్: రూ.5 లక్షల వరకు ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, Yono, NEFT, RTGS ద్వారా జరిపే లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు ఉండవు.

ఎస్‌బిఐ బ్రాంచ్ ద్వారా జరిపే లావాదేవీలు ఐఎంపీఎస్ ఛార్జీలు – ఆఫ్‌లైన్ మోడ్: రూ.1,000 వరకు ఎలాంటి ఛార్జీలు లేవు. రూ. 1,000 – 10,000 వరకు రూ. 2 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ. రూ. 10,000 – 1,00,000 వరకు రూ. 4 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ. రూ.1,00,000 – 2,00,000 వరకు రూ. 12 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ. రూ. 2,00,000 – 5,00,000 వరకు(కొత్త స్లాబ్) రూ. 20 సర్వీస్ ఛార్జి+జీఎస్టీ.

ఎస్‌బిఐ NEFT సర్వీస్ ఛార్జీలు – ఆఫ్‌లైన్ మోడ్: రూ. 10,000 వరకు రూ. 2 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ. రూ. 10,000 – 1,00,000 వరకు రూ. 4 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ. రూ. 1,00,000 – 2,00,000 వరకు రూ. 12 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ. రూ. 2,00,000 పైన రూ. 20 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ.

ఎస్‌బిఐ RTGS సర్వీస్ ఛార్జీలు-ఆఫ్‌లైన్ మోడ్: రూ. 2,00,000 – 5,00,000 వరకు రూ. 20 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ. రూ. 5,00,000 పైన రూ. 40 సర్వీస్ ఛార్జీ+జీఎస్టీ.

Also read:

T.Congress: అలక పాన్పుపై మరో టి.కాంగ్రెస్ నేత.. గాంధీ భవన్‌కు దూరంగా..

PGIMER Jobs: పీజీఐఎమ్ఈఆర్‌లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్… త్వరలో ముగియనున్న గడువు!

Shweta Tiwari: వెకిలి మాట‌ల‌తో న‌వ్వుల పాలైన బాలీవుడ్ న‌టి.. కేసు నమోదు చేసిన పోలీసులు..