AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shweta Tiwari: వెకిలి మాట‌ల‌తో న‌వ్వుల పాలైన బాలీవుడ్ న‌టి.. కేసు నమోదు చేసిన పోలీసులు..

Shweta Tiwari: కొన్ని సంద‌ర్భాల్లో సెల‌బ్రిటీలు చేసే కొన్ని వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాల‌కు దారి తీస్తుంటాయి. తెలిసి చేస్తారో తెలియ‌క చేస్తారో కానీ స‌మాజంలో వారిపై ఉన్న గౌర‌వాన్నిత‌గ్గించేలా ఉంటాయి ఆ వ్యాఖ్య‌లు. తాజాగా బాలీవుడ్‌కు చెందిన బుల్లితెర‌ న‌టీమ‌ణి...

Shweta Tiwari: వెకిలి మాట‌ల‌తో న‌వ్వుల పాలైన బాలీవుడ్ న‌టి.. కేసు నమోదు చేసిన పోలీసులు..
Narender Vaitla
|

Updated on: Jan 28, 2022 | 3:09 PM

Share

Shweta Tiwari: కొన్ని సంద‌ర్భాల్లో సెల‌బ్రిటీలు చేసే కొన్ని వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాల‌కు దారి తీస్తుంటాయి. తెలిసి చేస్తారో తెలియ‌క చేస్తారో కానీ స‌మాజంలో వారిపై ఉన్న గౌర‌వాన్నిత‌గ్గించేలా ఉంటాయి ఆ వ్యాఖ్య‌లు. తాజాగా బాలీవుడ్‌కు చెందిన బుల్లితెర‌ న‌టీమ‌ణి శ్వేతా తివారీ (Shweta Tiwari) ఇలాంటి కొన్ని వ్యాఖ్య‌లు చేసే న‌వ్వుల‌పాలైంది. ఏకంగా దేవుడిని ఉద్దేశిస్తూ వెకిలి వ్యాఖ్య‌లు చేసింది.

వివ‌రాల్లోకి వెళితే.. హిందీ సీరియ‌ల్స్‌లో న‌టించే శ్వేతా తివారీ ఓ వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. ఈ వెబ్‌సిరీస్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా స‌హ న‌టుడు రోహిత్ రాయ్‌తో క‌లిసి భోపాల్‌లో మీడియా స‌మావేశంలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా శ్వేత చేసిన వ్యాఖ్య‌లే ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీశాయి. మ‌హాభార‌త్ ఫేమ్ సౌర‌భ్ ఈ వెబ్‌సిరీస్‌లో బ్రా ఫిట్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇదే విష‌యాన్ని చెప్ప‌ద‌లుచుకున్న స‌ద‌రు న‌టీమ‌ణి.. సౌర‌భ్ పాత్ర‌ను ఉద్దేశిస్తూ నా బ్రా సైజులు దేవుడు తీసుకుంటున్నాడంటూ వ్యాఖ్యానించింది. దీంతో న‌టి చేసిన ఈ వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ విష‌యం కాస్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో శ్వేత తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కుంటోంది.

ఈ క్ర‌మంలోనే భోపాల్‌లో శ్వేతపై కేసు న‌మోదైంది. ఇక ఈ విష‌యంపై మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోంశాఖ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా కూడా స్పందించారు. శ్వేతా తివారి నోటి నుంటి నేను కూడా ఈ మాటలు స్వయంగా విన్నానని చెప్పిన మంత్రి… దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని, కచ్చితంగా ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పోలీస్ కమీషనర్‌ను ఆదేశించానని చెప్పుకొచ్చారు.

Also Read: Sweta Varma: బుల్లెట్ బండిని కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. రైడ్ కు వెళ్లే టైమొచ్చిందంటూ..

ప్రకృతి ఒడిలో టాలీవుడ్ ముద్దుగుమ్మ సదా

Shruthi Haasan: స‌లార్‌లో శృతీ హాస‌న్ లుక్ వ‌చ్చేసింది.. ఆద్యాను ప‌రిచ‌యం చేసిన ప్ర‌శాంత్ నీల్‌..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!