Gold, Silver Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగి వస్తున్న పసిడి.. ఇదే బాటలో వెండి
Gold, Silver Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసిడి మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు..
Gold, Silver Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసిడి మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం జోరుగా సాగుతూనే ఉంటాయి. ఇక పెళ్లి సీజన్ వచ్చిందంటే చాలు జ్యూలరీ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. ఇక బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. శనివారం (జనవరి 29)న దేశంలో బంగారం ధర భారీగా దిగి వచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల ధరపై రూ.350 నుంచి 500 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి విషయానికొస్తే దేశంలో వెండి ధర ధర భారీగా తగ్గింది. కిలో వెండి ధరపై రూ.1200కుపైగా తగ్గుముఖం పట్టింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (10 గ్రాముల ధర)
► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300 ఉంది.
► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 ఉంది.
► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 ఉంది.
► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 ఉంది.
► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 ఉంది.
► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 ఉంది.
► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 ఉంది.
వెండి ధరలు:
► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 62,000 లుగా ఉంది.
► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 62,000లుగా కొనసాగుతోంది.
► తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 66,300లుగా ఉంది.
► కోల్‌కతాలో కిలో వెండి ధర 62,000 లుగా ఉంది.
► కేరళలో కిలో వెండి ధర 63,300 లుగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 66,300గా ఉంది.
► విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 66,300గా ఉంది.
► విశాఖపట్నంలో సిల్వర్ రేట్ రూ. 66,300 వద్ద కొనసాగుతోంది.
బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పు చోటు చేసుకుంటుండటం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణమనే చెప్పాలి. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే ముందు వెళ్లే సమయానికి ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.