AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: కరోనా సమయంలో కూడా బంగారం కొనుగోళ్ల జోరు.. భారత్‌కు 800 టన్నుల పసిడి.. ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక

Gold: బంగారం.. దీనికి భారతీయులు (Indians) అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. భారత్‌లో కొనుగోళ్లు భారీగానే జరుగుతుంటాయి...

Gold: కరోనా సమయంలో కూడా బంగారం కొనుగోళ్ల జోరు.. భారత్‌కు 800 టన్నుల పసిడి.. ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక
Gold
Subhash Goud
|

Updated on: Jan 29, 2022 | 5:08 AM

Share

Gold: బంగారం.. దీనికి భారతీయులు (Indians) అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. భారత్‌లో కొనుగోళ్లు భారీగానే జరుగుతుంటాయి. కరోనా సమయంలో కూడా బంగారం విక్రయాలు జోరుగా సాగాయి. ఇక గత సంవత్సరం దేశంలో 797.3 టన్నుల బంగారం విక్రయాలు (Gold Sales) జరిగినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (World Gold Council) తాజా తన నివేదిలో వెల్లడించింది. కస్టమర్ల సెంటిమెంట్‌ ఎక్కువగా ఉండటంతో బంగారానికి గిరాకీ పెరిగిందని తెలిపింది. ఈ ఏడాది మాత్రం సానుకూలంగా ఉంటుందని తెలిపింది. 2020లో దేశంలో (India)  446.4 టన్నుల బంగారానికి గిరాకీ ఉన్నందున దానితో పోల్చితే 2021లో 78.6 శాతం వృద్ది లభించిందని తెలిపింది.

ఇక పండగల సీజన్‌కు తోడు పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్న అక్టోబర్‌-డిసెంబర్‌ నెలలోనే 343 టన్నుల బంగారానికి గిరాకీ లభించిందని, ఇందులో భరణాల వాటా 265 టన్నులు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ సంవత్సరం బంగారానికి గిరాకీ కోవిడ్‌ పెరిగినా , 2021 అక్టోబరు-డిసెంబరు నాటి వినియోగస్థాయి లభించకపోవచ్చని వివరించారు. ఈ త్రైమాసికంలో పెట్టుబడుల కోసం 79 టన్నుల పసిడికి గిరాకీ ఉందని, ఇది 8 ఏళ్ల గరిష్ఠస్థాయిగా పేర్కొన్నారు. కరోనా కారణంగా వివాహాలు, ఇతర శుభకార్యాలు తక్కువ మందితో జరిగినందున, ఆదా అయిన మొత్తంతో బంగారం కొనుగోళ్లు జరిపారని పేర్కొన్నారు. అలాగే బంగారు నగల తయారీదారులు, విక్రేతదారులు హాల్‌మార్కింగ్‌ నిబంధనల మేరకు కొత్తనగలు తయారు చేసేందుకకు ఎక్కువ మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకున్నారని తెలిపారు. ఈ ఏడాదిలో 800 నుంచి 850 టన్నుల బంగారం వినియోగం అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి:

Banking News: మూడవ త్రైమాసికంలో ఆ బ్యాంకు లాభాలు రెట్టింపు.. జనవరిలో పెరిగిన చార్జీలు..!

TRAI New Guidelines: టెలికం కంపెనీలకు ట్రాయ్‌ కీలక ఆదేశాలు.. కస్టమర్లకు ఊరట..!

Follow Us
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు