భార్యాభర్తలకు నెలకు రూ. 10,000 పెన్షన్.. తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి..?

Atal Pension Yojana: చాలామంది యువత రిటైర్మెంట్‌ తర్వాత జీవితం సాఫీగా సాగడానికి చాలా ప్లాన్‌లు వేస్తున్నారు. భవిష్యత్‌లో

భార్యాభర్తలకు నెలకు రూ. 10,000 పెన్షన్.. తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి..?
Imps Charges
uppula Raju

|

Jan 30, 2022 | 8:23 AM

Atal Pension Yojana: చాలామంది యువత రిటైర్మెంట్‌ తర్వాత జీవితం సాఫీగా సాగడానికి చాలా ప్లాన్‌లు వేస్తున్నారు. భవిష్యత్‌లో ఆర్థికంగా బలంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచే రిటైర్మెంట్‌ ప్లాన్‌లు పాటిస్తున్నారు. అయితే ఇందుకోసం మార్కెట్‌లో ఎన్నో స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ రిటైర్మెంట్ తర్వాత భార్యా భర్తలు నెలకు రూ.10,000 పెన్షన్ పొందే పథకం గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఆ పథకం పేరు అటల్‌ పెన్షన్ యోజన(APY), ఇది మీ పెట్టుబడులపై భద్రతతో పాటు మంచి రాబడిని అందిస్తుంది. ప్రణాళిక ప్రకారం, భార్యాభర్తలు 2 వేర్వేరు ఖాతాలను ఓపెన్‌ చేయడం ద్వారా నెలకు రూ.10,000 పెన్షన్ పొందవచ్చు. పథకం ప్రయోజనం ఏంటంటే పన్ను చెల్లించే వ్యక్తులు పథకంలో వారి డిపాజిట్లపై పన్ను మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అసంఘటిత రంగాల్లో నిమగ్నమై ఉన్న ప్రజలకు వారి భవిష్యత్‌ సురక్షితంగా ఉండేందుకు 2015లో అటన్ పెన్షన్ పథకం ప్రారంభించారు. ఇందులో 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా తమ డబ్బును ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఒక వ్యక్తికి బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉంటే వారు తమ పెట్టుబడి ఎంపికగా అటల్ పెన్షన్ యోజనను సులభంగా ఎంచుకోవచ్చు.

60 ఏళ్లు నిండిన తర్వాత పెట్టుబడిదారులు పెన్షన్ పొందడానికి అర్హులు. అటల్‌ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టాలంటే ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ తప్పనిసరి. ఒక వ్యక్తి చేసిన పెట్టుబడులను బట్టి వారు రూ.1,000 లేదా రూ. 2,000 లేదా రూ. 3,000 లేదా రూ. 4,000 లేదా గరిష్టంగా రూ. 5,000 అందుకుంటారు. పెన్షన్ కోరే వ్యక్తి రూ.5,000 నెలవారీ పెన్షన్ పొందాలనుకుంటే వారు 18 ఏళ్ల వయస్సు నుంచి నెలకు రూ. 210 డిపాజిట్ చేయాలి.

రూ. 10,000 నెలవారీ పెన్షన్ ఎలా సంపాదించాలి?

10,000 పెన్షన్ సంపాదించడానికి 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న జంట 2 వేర్వేరు అటల్ పెన్షన్ యోజన ఖాతాలను ప్రారంభించవచ్చు. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 10,000 పింఛను పొందేందుకు వారు ఒక్కొక్కరు తమ ఖాతాల్లో రూ.577 జమ చేయాల్సి ఉంటుంది. అటల్ పెన్షన్ యోజనలో పెట్టిన పెట్టుబడులు పెట్టుబడిదారులకు పన్ను ఆదా చేయడంలో సహాయపడతాయి. వారు ఆదాయపు పన్ను చట్టం 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.

SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులు అలర్ట్‌.. ఫిబ్రవరి 1 నుంచి ఈ సేవలకు బాదుడే..?

U19 World Cup 2022: సెమీ ఫైనల్‌లో భారత్‌కి టఫ్ పోరు.. ఎవరితో తలపడనుందో పూర్తి షెడ్యూల్‌ తెలుసుకోండి..?

Ayurveda: ఆయుర్వేదం ప్రకారం భోజన నియమాలు మీకు తెలుసా..?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu