IND vs WI: T20 సిరీస్‌కి జట్టుని ప్రకటించిన వెస్టిండీస్‌.. 16 మంది ఆటగాళ్ల ఎంపిక..

IND vs WI: భారత్‌తో జరిగే 3 మ్యాచ్‌ల T20 సిరీస్‌కి వెస్టిండీస్ జట్టును ప్రకటించింది. దాదాపు జట్టులో ఎలాంటి మార్పు లేదు.

IND vs WI: T20 సిరీస్‌కి జట్టుని ప్రకటించిన వెస్టిండీస్‌.. 16 మంది ఆటగాళ్ల ఎంపిక..
T20i Squad
Follow us
uppula Raju

|

Updated on: Jan 30, 2022 | 7:48 AM

IND vs WI: భారత్‌తో జరిగే 3 మ్యాచ్‌ల T20 సిరీస్‌కి వెస్టిండీస్ జట్టును ప్రకటించింది. దాదాపు జట్టులో ఎలాంటి మార్పు లేదు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో ఆడుతున్న అదే జట్టుని భారత పర్యటనకు ఎంపిక చేసింది. కెప్టెన్‌ కీరన్ పొలార్డ్, వైస్-కెప్టెన్ నికోలస్ పూరన్‌తో ఉన్న జట్టులో మొత్తం 16 మంది ఆటగాళ్లు ఉన్నారు. అంతకుముందు, వెస్టిండీస్ వన్డే జట్టును కూడా ప్రకటించింన విషయం తెలిసిందే. ఈ జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌తో తలపడనుంది. వన్డే జట్టు కమాండ్ కూడా పొలార్డ్ చేతిలోనే ఉంటుంది.

ఫిబ్రవరి 16 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ ఫిబ్రవరి 18న, మూడో మ్యాచ్ ఫిబ్రవరి 20న జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీ20 సిరీస్ జరగనుంది. అంతకు ముందు ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. రెండో వన్డే ఫిబ్రవరి 9న, మూడో వన్డే ఫిబ్రవరి 11న జరగనుంది. మొత్తంమీద ఫిబ్రవరి 6 నుంచి 20 మధ్య అంటే 14 రోజుల్లో వెస్టిండీస్ భారత పర్యటనలో ODI, T20 సిరీస్‌లను ఆడుతుంది.

టీ20 జట్టులో మార్పులు చేయకపోవడంపై హేన్స్ ఏమన్నారు?

టీ20 జట్టును మార్చకపోవడంపై వెస్టిండీస్ చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆటగాళ్లందరూ బాగా రాణిస్తున్నారు. కాబట్టి మేము అదే ఆటగాళ్లతో ఆడాలని నిర్ణయించుకున్నాము. అధ్భుతంగా ఆడుతున్నారు. భారత పర్యటనలో కూడా ఇదే విధమైన ఆటను చూడాలని మేము ఆశిస్తున్నాము” అన్నారు.

టీ20 సిరీస్ కోసం 16 మందితో కూడిన వెస్టిండీస్ జట్టు

కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్, డొమినిక్ డ్రేక్స్, షాయ్ హోప్, అకిల్ హొస్సేన్, బ్రాండన్ కింగ్, రోవ్‌మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, ఒడియోన్ షెపర్డ్, కైల్ మైయర్స్, హేడెన్ వాల్ష్ జూనియర్.

అన్ని వన్డే మ్యాచ్‌లు నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతాయి. కాగా టీ20 సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్నాయి.

Ayurveda: ఆయుర్వేదం ప్రకారం భోజన నియమాలు మీకు తెలుసా..?

IGNOU: సంస్కృతం, ఉర్దూలో గ్రాడ్యుయేషన్ కోర్సు ప్రారంభించిన ఇగ్నో.. అడ్మిషన్లు స్టార్ట్..

Dance With Me: ఉర్రూతలూగిస్తున్న సల్మాన్ ‘డ్యాన్స్ విత్ మి’‌.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌..