AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్‌పై తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది.. ఆలస్యంగా చెల్లిస్తే..

Kisan Credit Card: క్రెడిట్ కార్డు రైతులకు ఎంతో మేలు చేస్తుంది. దేశంలోని రైతులు వ్యవసాయం కోసం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన..

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్‌పై తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది.. ఆలస్యంగా చెల్లిస్తే..
Subhash Goud
|

Updated on: Jan 30, 2022 | 6:24 AM

Share

Kisan Credit Card: క్రెడిట్ కార్డు రైతులకు ఎంతో మేలు చేస్తుంది. దేశంలోని రైతులు వ్యవసాయం కోసం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, అలాగే వారు సరైన సమయంలో వ్యవసాయానికి డబ్బు పొందేలా కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రారంభించబడింది. అయితే KCC కార్డ్ హోల్డర్లు తమ ఖాతాను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయలేని రైతులు వారికి సబ్సిడీ ప్రయోజనం లభించదు. రుణంపై వడ్డీతో పాటు జరిమానా విధించే బ్యాంకులు చాలా ఉన్నాయి. ఆ KCC ఖాతాపై వడ్డీ రేటు ఏడు శాతానికి బదులుగా తొమ్మిది శాతం వరకు వసూలు చేయబడుతుంది. ఇది మాత్రమే కాదు, ఈ వడ్డీ రేటు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. కొన్ని సందర్భాల్లో మరియు బ్యాంకులలో, వడ్డీ రేటు మూడేళ్ల తర్వాత 14 శాతానికి చేరుకుంటుంది.

కిసాన్ క్రెడిట్ కార్డ్‌ని KCC Fabhi అంటారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాన్ని ఎల్లప్పుడూ సరైన సమయంలో కట్టాల్సి ఉంటుంది. దీంతో రైతులకు మేలు జరుగుతుంది. అంతే కాకుండా రుణమాఫీ కోసం ఎదురుచూడడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందా లేక సకాలంలో రుణం చెల్లించడం వల్ల ప్రయోజనం ఉంటుందా అన్నది రైతులు అర్థం చేసుకోవాలి. కిసాన్ క్రెడిట్ కార్డ్‌పై, కార్డు హోల్డర్లు ఒక రూపాయి నుండి మూడు లక్షల రూపాయల వరకు ఏడు శాతం చొప్పున వడ్డీని చెల్లించాలి. ఇది ఆరు నెలవారీ ప్రాతిపదికన (మే 31 మరియు నవంబర్ 30 తేదీలలో) ఉంటుంది.. ఇది కాకుండా, కార్డ్ హోల్డర్ తన ఖాతాను ఒక సంవత్సరంలోపు పునరుద్ధరించుకోవాలి. పునరుద్ధరణపై, 3% వడ్డీ సబ్సిడీగా తిరిగి ఇవ్వబడుతుంది. ఈ విధంగా సరైన సమయంలో రుణాలు చెల్లించే రైతులకు నాలుగు శాతం చొప్పున రుణాలు అందుతాయి.

రుణం చెల్లించడంలో తప్పు చేయవద్దు

అనేక సార్లు రైతులు సరైన సమయంలో కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ( KCC) రుణాన్ని చెల్లించడంలో తప్పు చేస్తారు. అనేక సార్లు రాజకీయ నాయకులు రుణమాఫీ చేస్తామని ఎన్నికల వాగ్దానాలు చేస్తుంటారు. దీంతో ఆశతో చాలాసార్లు రైతులు వడ్డీలు సక్రమంగా చెల్లించరు. దీంతో బ్యాంకులు రైతులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా అనేక సార్లు బ్యాంకులు ఖాతాదారు నుండి జరిమానా, వడ్డీ, రికవరీ ఖర్చులు, లాగర్ ఛార్జీలతో సహా అనేక ఛార్జీలను వేస్తూ డబ్బు వసూలు చేస్తాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా మొత్తం కిసాన్‌ క్రెడిట్‌ కార్డు (KCC) రుణాన్ని మాఫీ చేయదని నిపుణులు భావిస్తున్నారు.

రుణాన్ని సకాలంలో చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలు

సకాలంలో రుణం చెల్లించిన రైతులకు వడ్డీ మాఫీ ఉంటుంది. సరైన సమయంలో రుణాన్ని చెల్లించని రైతులకు వడ్డీ ఎక్కువగా పడుతుంది. మరోవైపు, ఈ మొత్తానికి బ్యాంక్ తీసుకున్న ఇతర ఛార్జీలు కలిపితే ఎక్కువ మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా, మీ CIBIL స్కోర్ కూడా పడిపోతుంటుంది. దీని కారణంగా మీరు బ్యాంకు నుండి రుణం తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొవలసి రావచ్చు.

ఇవి కూడా చదవండి

TRAI New Guidelines: టెలికం కంపెనీలకు ట్రాయ్‌ కీలక ఆదేశాలు.. కస్టమర్లకు ఊరట..!

Banking News: మూడవ త్రైమాసికంలో ఆ బ్యాంకు లాభాలు రెట్టింపు.. జనవరిలో పెరిగిన చార్జీలు..!