Bholaa Shankar: చిరంజీవి ఆ విషయంలో వెనక్కి తగ్గలేదా..? ప్రచారంపై స్పందించిన ‘భోళా శంకర్’ నిర్మాణ సంస్థ..

Bholaa Shankar: అసలే మెగాస్టార్ సినిమా.. ఇక అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.. తమిళం హిట్ సినిమా.. తెలుగు రిమేక్.. అంతా ఓ రేంజ్‌లో ఉంటాయని భావించారు. కానీ.. ఆ అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. కారణాలు ఏమైనప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది.

Bholaa Shankar: చిరంజీవి ఆ విషయంలో వెనక్కి తగ్గలేదా..? ప్రచారంపై స్పందించిన ‘భోళా శంకర్’ నిర్మాణ సంస్థ..
Bholaa Shankar
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 15, 2023 | 9:45 PM

Bholaa Shankar: అసలే మెగాస్టార్ సినిమా.. ఇక అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.. తమిళం హిట్ సినిమా.. తెలుగు రిమేక్.. అంతా ఓ రేంజ్‌లో ఉంటాయని భావించారు. కానీ.. ఆ అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. కారణాలు ఏమైనప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. రిలీజ్‌కు ముందు ఓ లెక్క.. రిలీజ్‌కు తర్వాత మరో లెక్క అనేలా మారిన భోళా శంకర్ మూవీ గురించి తెలుగు రాష్ట్రాల్లో ట్రెండీ టాపిక్‌గా కంటిన్యూ అవుతూనే ఉంది. చిరంజీవి రేంజ్ ఉన్న స్టార్ చేయాల్సిన సినిమా కాదని.. తెలుగు ఫిల్మ్ లవర్స్ నుంచి టాక్ వస్తుండటం.. మరో వైపు చిరంజీవి రెమ్యునరేషన్ గురించి మరో ప్రచారం జరుగుతుండటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది..

వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా.. కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించిన భోళాశంకర్ మూవీ భారీ అంచనాలమధ్య ఆగస్టు 11న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సత్తా చూపలేకపోయింది. తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదలమ్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా.. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అనిల్ సుంకర, కేఎస్ రామారావు, సుంకర (AK Entertainments) నిర్మించారు. అయితే, మెహర్ రమేష్ ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసినప్పటికీ.. పెద్దగా ప్రభావం చూపెట్టలేదు. సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో కలెక్షన్స్ కూడా తగ్గుతున్నట్లు సమాచారం. ఈ సినిమా వీకెండ్ కలెక్షన్లు చూసుకుంటే దాదాపు రూ.28 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. చిరంజీవి రెమ్యునరేషన్‌ విషయంలో పలు ఛానెళ్లలో, సోషల్ మీడియా వేదికగా పలు విషయాలు ప్రచారమవుతున్నాయి. ఈ వార్తలపై నిర్మాణ సంస్థ స్పష్టతనిచ్చింది. భోళా శంకర్‌ హిట్ అందుకోలేకపోయినప్పటికీ.. తన రెమ్యునరేషన్‌ విషయంలో చిరంజీవి వెనక్కి తగ్గలేదని.. మొదట అనుకున్నట్లు గానే తన పారితోషికం చెల్లించాల్సిందేనని చిరు పట్టుబడుతున్నారంటూ పలు వెబ్‌ సైట్లలో వార్తలు వెలువడ్డాయి. దీంతో సోషల్ మీడియాలో నెగటివిటి కూడా పెరిగింది. ఒకపక్క సినిమా హిట్ అందుకోలేక నిర్మాణ సంస్థ ఇబ్బందులు పడుతుంటే, చిరు పారితోషికం చెల్లించేందుకు చిత్ర నిర్మాత అనిల్‌ సుంకర ఇల్లు, తోట తాకట్టు పెట్టారంటూ కొన్ని వెబ్ సైట్లు రాశాయి.

ఇవి కూడా చదవండి

కాగా.. చిరంజీవి పారితోషికంపై వస్తున్న వార్తలపై భోళా శంకర్ నిర్మాణసంస్థ మంగళవారం స్పష్టత నిచ్చింది. చిరంజీవి రెమ్యునరేషన్‌ వివాదంపై వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేసింది.. ఈ వార్తల్లో ఒక్కశాతం కూడా నిజం లేదని.. అలాంటి వార్తలను దయచేసి ఎవరూ నమ్మొద్దంటూ నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..