AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూట్యూబ్ వీడియో చూస్తూ నిండ గర్భిణికి నకిలీ డాక్టర్ ఆపరేషన్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

బీహార్‌లో చోటు చేసుకున్న దిగ్భ్రాంతికరమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మొత్తం ఆ ప్రాంతాన్ని కుదిపేసింది. భాగల్‌పూర్‌ జిల్లాలోని కహల్‌గావ్ బ్లాక్‌లోని ఎక్చారి పంచాయతీలోని శ్రీమత్ స్థాన్ సమీపంలోని ఒక నకిలీ వైద్యుడి నిర్వాకంతో నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. పురిటి నొప్పుతో వచ్చిన గర్భిణీ స్త్రీకి యూట్యూబ్ వీడియో చూసి శస్త్రచికిత్స చేశాడు.

యూట్యూబ్ వీడియో చూస్తూ నిండ గర్భిణికి నకిలీ డాక్టర్ ఆపరేషన్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
Pregnant Woman Surgery
Balaraju Goud
|

Updated on: Jan 09, 2026 | 4:43 PM

Share

బీహార్‌లో చోటు చేసుకున్న దిగ్భ్రాంతికరమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మొత్తం ఆ ప్రాంతాన్ని కుదిపేసింది. భాగల్‌పూర్‌ జిల్లాలోని కహల్‌గావ్ బ్లాక్‌లోని ఎక్చారి పంచాయతీలోని శ్రీమత్ స్థాన్ సమీపంలోని ఒక నకిలీ వైద్యుడి నిర్వాకంతో నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. పురిటి నొప్పుతో వచ్చిన గర్భిణీ స్త్రీకి యూట్యూబ్ వీడియో చూసి శస్త్రచికిత్స చేశాడు. ఆపరేషన్ సమయంలో ఆ మహిళ మరణించింది. అయితే నవజాత శిశువును సురక్షితంగా రక్షించారు. ఈ సంఘటనత కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహాన్ని డాక్టర్ క్లినిక్ వెలుపల ఉంచి ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. రసూల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

నిండు గర్భిణీ అయిన స్వాతి దేవి, అత్తమామలతో కలసి జార్ఖండ్‌లోని ఠాకూర్‌గంటి మోధియాలో నివసిస్తున్నారు. ఆమె భర్త రోషన్ సాహ్ దినసరి కూలీగా పనిచేస్తున్నారు. గర్భవతి అయిన తర్వాత, ఆ మహిళ రసల్‌పూర్‌లోని తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తోంది. అక్కడ ఆమె తల్లి సుష్మా దేవి ఆమెను చూసుకుంటుంది. ఆమె శ్రీమత్ స్థాన్ సమీపంలోని ఒక క్లినిక్‌లో చికిత్స పొందుతోంది. గురువారం (జనవరి 08) రాత్రి స్వాతి దేవి అకస్మాత్తుగా ప్రసవ నొప్పితో బాధపడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అదే క్లినిక్‌కు తరలించారు. ఆమెను పరీక్షించిన తర్వాత, నకిలీ వైద్యుడు తన సహాయకుడితో కలిసి ఆపరేషన్ అవసరమని నిర్ధారించాడు. కుటుంబ సభ్యుల సమ్మతి పొందిన తర్వాత, వైద్యుడు ప్రక్రియను అర్థం చేసుకోవడానికి యూట్యూబ్ వీడియోను చూసి అవసరమైన వైద్య సహాయం లేకుండానే ఆపరేషన్ ప్రారంభించాడు.

ఆపరేషన్ సమయంలో, డాక్టర్, అతని సహాయకుడు తమ మొబైల్ ఫోన్‌లో వీడియోను పదేపదే రీప్లే చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఇంతలో, ఆ మహిళకు తీవ్ర రక్తస్రావం జరిగి ఆపరేషన్ టేబుల్‌పైనే ప్రాణాలు వదిలింది. అయితే, నవజాత శిశువును సురక్షితంగా బయటకు తీశారు. దీని తరువాత, నకిలీ డాక్టర్, అతని సహాయకుడు రోగి పరిస్థితి బాగాలేదని, ఆమెను వేరే వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలని మెల్లగా సెలవిచ్చారు. అంతేకాదు, వారు క్లినిక్‌ను మూసివేసి అక్కడి నుండి పారిపోయారు. నిండు గర్భిణి మృతితో బాధిత కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

ఈ క్లినిక్ శ్రీమఠ్ స్థాన్ సమీపంలోని అమోద్ సా ఇంట్లో సంవత్సరాలుగా పనిచేస్తోంది. ఇక్కడ గతంలో అనేక సంఘటనలు, అవాంతరాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. కానీ ప్రతిసారీ ఈ విషయాన్ని దాచిపెట్టడం వల్ల ఎటువంటి ఖచ్చితమైన చర్యలు తీసుకోలేదు. గతంలో, మరొక వైద్యుడు ఇక్కడ నివసించాడు. కానీ గత రెండు సంవత్సరాలుగా, రసూల్‌పూర్ నివాసి అయిన రంజిత్ మండల్ ఒక మహిళ, ఒక పురుష సహాయకుడితో క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు.

గ్రామ ఆశా కార్యకర్త ఈ క్లినిక్ చిరునామాను అందించి తన మనవరాలిని అక్కడికి తీసుకువచ్చారని మృతురాలి అమ్మమ్మ సంజు దేవి ఆరోపించారు. చికిత్స ప్రారంభించే ముందు, వైద్యుడు 30,000 రూపాయలు డిమాండ్ చేశాడని, ఆ మొత్తానికి ఆపరేషన్ పూర్తి చేస్తామని చెప్పాడని ఆమె తెలిపింది. అంగీకరించిన తర్వాత, ఆపరేషన్ ప్రారంభమైంది. దాదాపు రెండు గంటల తర్వాత, రోగి పరిస్థితి క్షీణిస్తోందని, ఆమెను తీసుకెళ్లాలని డాక్టర్ ప్రకటించారు. ఆ సమయానికి, ఆమె మనవరాలు అప్పటికే చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది మొదటి సంఘటన కాదని స్థానిక నివాసి రాజేష్ కుమార్ అన్నారు. ఈ వైద్యుడు గతంలో యూట్యూబ్ చూడటం ద్వారా రోగులకు చికిత్స చేస్తున్నాడు. ఆ రాత్రి యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత మరో గర్భిణీ స్త్రీకి ఇలాంటి పెద్ద ఆపరేషన్ జరిగిందని, ఫలితంగా ఆమె మరణించిందని ఆయన పేర్కొన్నారు. సదరు నకిలీ వైద్యుడు, అక్రమ క్లినిక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతలో, బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఇన్‌ఛార్జి పవన్ కుమార్ ఈ ఘటసపై స్పందించారు. ఈ సంఘటన గురించి తనకు సమాచారం అందిందని, ఈ విషయంపై దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..